ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అయోమయంలో పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.. ఈ క్రమంలో గత ప్రభుత్వం పై ఆరోపణల దాడులు ఆగడం లేదు.. కాంగ్రెస్ మంత్రులంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం భారీ దోపిడీకి గురైందని విమర్శిస్తున్నారు.. ఈ క్రమంలో విద్యుత్ కొనుగోలు కోసం గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు.
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించిన అనంతరం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ముడి సరకు, పర్యావరణ సమస్యలు ఉన్నాయని తెలిపారు. రూ.59,580 కోట్ల బకాయిలు విద్యుత్ కొనుగోలు కింద ఉన్నాయని వెల్లడించారు.. ప్రతి శాఖను గత ప్రభుత్వం అప్పుల్లో ముంచిందని ఆరోపించిన భట్టి.. కొత్త ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా, ముందుచూపుతో అడుగులు వేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.. విద్యుత్ శాఖలోని సమస్యలను క్రమంగా అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందుకే ప్రతి శాఖలోని పరిస్థితులను సమీక్ష చేస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలు, ఉద్యోగులు కలిసి పని చేస్తేనే రాష్ట్రం సమస్యలను అధిగమించి, అభివృద్ధి వైపు పయనిస్తుందని వివరించారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (Bhadradri Thermal Power Plant) విషయంలో అనేక సమస్యలు ఉన్నాయన్న ఆయన, ప్లాంట్‌కు ముడి సరకు, పర్యావరణ సమస్యలు ఉన్నాయని తెలిపారు.
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, యాదాద్రి (Yadradri) పవర్ స్టేషన్ పెడుతున్నామంటూ రాష్ట్రాన్ని అత్యంత ప్రమాదకరమైన, భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అందుకే శాసససభ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేసి, వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తోందన్నారు. మరోవైపు తెలంగాణ (Telangana) ఆర్థిక వ్యవస్థను సరైన దారిలో తీసుకెళ్లేందుకు అంతా కలిసి కృషి చేస్తున్నట్టు వివరించారు.