Telugu News » Bhatti Vikramarka: ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం..!

Bhatti Vikramarka: ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం..!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉన్న దాంట్లోనే కొద్దీ కొద్దిగా అన్నిటినీ అమలు చేస్తామని ప్రకటించారు.

by Mano
Bhatti Vikramarka: We are committed to six guarantees..!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉన్న దాంట్లోనే కొద్దీ కొద్దిగా అన్నిటినీ అమలు చేస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి రూపాయిని అన్ని వర్గాలకు చేరాలన్నదే తమ ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.

Bhatti Vikramarka: We are committed to six guarantees..!

కాగా, బడ్జెట్‌ను సహేతుకంగా రూపొందించామని భట్టి విక్రమార్క తెలిపారు. గత పదేళ్ళలో ఆదాయం ఉన్నా లేకున్నా.. ప్రతి ఏడాది 20 శాతం బడ్జెట్ పెంచుతూ వచ్చారని చెప్పారు. ఈ సారి అలా చేయబోమన్నారు. బడ్జెట్‌లో 5 నుంచి 6 శాతం తేడా కంటే ఎక్కువ ఉండొద్దన్నదే తమ ఆలోచన అని ఆయన తెలిపారు. బడ్జెట్ తగ్గించడంపై ఎవరు ఏమనుకున్నా.. వాస్తవ బడ్జెట్ ఉండాలి అనేది తమ విధానమని తెలిపారు.

అదేవిధంగా 2. 75 లక్షల కోట్ల బడ్జెట్‌లో.. గతంలో మాదిరిగా గ్యాప్స్ ఉండవన్నారు డిప్యూటీ సీఎం. ఉన్నది ఉన్నట్టు వాస్తవ రూపంలో బడ్జెట్ ఉండాలనేది తమ విధానమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు లేకున్నా బడ్జెట్ పెంచి బీసీలకు రుణాలు, దళితబంధు ఇవ్వలేక పోయారని భట్టి విమర్శించారు. రాష్ట్రానికి రూ.7 లక్షల 11 వేల కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. అప్పు చేయకపోతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

మరోవైపు యువత ఉద్యోగాల కోసం పదేళ్లు గడ్డాలు పెంచుకుని తిరిగారని అన్నారు. ఒక్క గ్రూప్-1 ఉద్యోగం అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. 3500 ఇందిరమ్మ ఇండ్లు ప్రతీ నియోజకవర్గంలో ఇస్తామని డిప్యూటీ సీఎం అసెంబ్లీలో తెలిపారు. నెలకు రూ.300 కోట్లు అదనంగా ఆర్టీసీకి ఇస్తున్నామని తెలిపారు. రూ.500కే సిలిండర్, మహాలక్ష్మి పథకం అమలుకు అంచనాలు వేస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

You may also like

Leave a Comment