అధికారంలో కాంగ్రెస్.. ప్రతిపక్షంలో బీఆర్ఎస్.. ఈ రెండు పాము ముంగిసల్లా కొట్లాడుకొంటున్నాయని రాష్ట్ర ప్రజలు అనుకొంటున్నారు.. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.. బీఆర్ఎస్ మెడకు ఉరితాళ్ళలా బిగుసుకొన్నాయని.. హస్తం నేతలు ఆనందపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే.. గబుక్కున మింగేద్దామని గులాబీ నేతలున్నట్టు తెలుస్తుంది. అయితే వీరి తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.
ఖమ్మం (Khammam) జిల్లా ఎర్రుపాలెం మండంలం, బనిగండ్లపాడులో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పాల్గొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని పూర్తిగా వుడ్చేశామూ ఇంకా కాంగ్రెస్ (Congress) ప్రజలకి ఏమి చేస్తుందని కొందరు అనుకుంటున్నారు. కానీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.. సంపద ఎలా సృష్టించాలో మాకు తెలుసని బీఆర్ఎస్ (BRS)పై మండిపడ్డారు.
దోపిడీ చేయకుండా సంపద ను ప్రజలకు పంచి పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు గుర్తు చేసుకొన్న భట్టి.. అమలు చేయని మూడు ఎకరాల హామీ మాదిరిగా.. అరు గారెంటీ పథకాలు అమలు కాకుండా వుంటే బాగుండని ఆశిస్తున్న వారికి బుద్ధి వచ్చేలా.. ఎన్ని కష్టాలు వున్న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. అనంతరం బానిగెండ్ల పాడు, ప్రజా పాలనలో 3,90,000 వేల దరఖాస్తులు స్వీకరించినట్లు డిప్యూటీ సీఎంకు కలెక్టర్ గౌతమ్ వివరించారు.
మరోవైపు బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఏ ఒక్క ఊరిలో కూడా కాలనీలు కట్టలేదని ఆరోపించిన భట్టి.. అయిదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునెందుకు ఇస్తామన్నారు. పనికి రాని టెక్నాలజీ భద్రాద్రిలో తీసుకొని వచ్చారని విమర్శించిన మంత్రి.. కరెంట్ పేరు చెప్పుకొని.. లక్ష కోట్ల అప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల భారాన్ని మోస్తునే నాణ్యమైన కరెంట్ ఇస్తామని వివరించారు.. మీ ప్రభుత్వంలో బాస్ ఒకరిద్దరు అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ జవాబు దారులేనని అన్నారు..