Telugu News » Bhuvanagiri MP : తెలంగాణ సంపదను పందికొక్కుల్లా దోచుకున్నారు..!?

Bhuvanagiri MP : తెలంగాణ సంపదను పందికొక్కుల్లా దోచుకున్నారు..!?

నల్గొండ ప్రజలకు జీవితాంతం రుణ పడి ఉంటానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు నయవంచనకు గురయ్యారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇస్తే... ఇక్కడి సంపదను పందికొక్కుల్లా దోచుకున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు.

by Venu

కాంగ్రెస్ (Congress)పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి (Bhuvanagiri)ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy Venkatareddy) స్టైలే వేరు. నిత్యం వార్తల్లో హాట్ హాట్ కామెంట్స్‌తో ఉంటారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తిప్పర్తి మండల బీఆర్ఎస్ (BRS) నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని తన నివాసంలో వెంకట్ రెడ్డి.. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు మీడియా సమావేశంలో వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..

నల్గొండ ప్రజలకు జీవితాంతం రుణ పడి ఉంటానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు నయవంచనకు గురయ్యారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇస్తే… ఇక్కడి సంపదను పందికొక్కుల్లా దోచుకున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు. పైకి శత్రువుల్లా నటిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంతో పని చేస్తున్నాయని విమర్శించారు.

బీఆర్ఎస్ అవినీతిని అంతం చేసే సమయం వచ్చిందన్న వెంకటరెడ్డి.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఓటమి భయం పట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆరు గ్యారంటీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకటరెడ్డి మండిపడ్డారు. మరోవైపు తన నియోజక వర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను తిరిగి చేపడతానని, తన ఫౌండేషన్ తరుఫున కూడా పనులు ప్రారంభిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

You may also like

Leave a Comment