ఐపీఎల్-2024 సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా మార్చి 27న జరిగిన ముంబై ఇండియన్స్(Mumbai Indians), సన్ రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఇరు జట్ల ఫ్యాన్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ముంబై ఇండియన్ ఫ్యాన్స్ ఓ సీఎస్కే అభిమాని(CSK FAN DIED)పై దాడి చేయగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. మృతుడిది మహారాష్ట్రలోని కొల్హాపూర్.
వివరాల్లోకివెళితే.. ఉప్పల్‌లో స్టేడియంలో హైదరాబాద్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో మహారాష్ట్ర కొల్లాపూర్‌కు చెందిన కొందరు ఒకచోట చేరి చూస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ ఔట్ అయ్యాడు.దీంతో సీఎస్కే ఫ్యాన్ అయిన 63 ఏళ్ల బండో పంత్ బాపుసో టిబిలే హేళనగా మాట్లాడుతూ.. రోహిత్ ఔట్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు.
అది జీర్ణించుకోలేని రోహిత్ ఫ్యాన్స్ ఇద్దరు అతడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.ఆ తర్వాత అది ఫ్యాన్స్‌కు గొడవకు దారి తీసింది. ఈ క్రమంలోనే బండో పంత్ తలపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు ఆదివారం మృతిచెందాడు. కాగా, ఇతని మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
బండో పంత్ సీఎస్కే అభిమాని అని తెలియడంతో తోటి చెన్నయ్ ఫ్యాన్స్ అతని మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, బండో పంత్ మృతితో ఆయన సొంతూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.