ఆర్జేడీ అధినేత, బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమార్తె మిసా భారతీ (Misa Bharti) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని మోడీ (Modi)తో పాటు బీజేపీ (BJP) నేతల్ని జైలుకి పంపిస్తామని చెప్పడం వివాదానికి దారితీసింది.. అదీగాక ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ, బీజేపీ పార్టీల నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకొంటున్నారు..
మరోవైపు మిసా భారతీ, ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తోంది. అసలు మీకు ‘మిసా’ అనే పేరు ఎందుకు పెట్టారో ఆలోచించుకోవాలని సైటర్లు వేస్తున్నారు.. ఇక ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బీజేపీ అవినీతికి పాల్పడిందని ఆమె దుయ్యబట్టారు.. ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవాడే మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ప్రచారం ఏ స్థాయికి దిగజారిందనే దానికి మిసా భారతి వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు. .
మోడీని చంపుతాం, జైలులో వేస్తామని మిసా చెబుతున్నారని, అయితే దేశం మాత్రం అవినీతిపరులు చివరికి వెళ్లవలసింది జైలులోకి కాదా అని జనం మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు.. అలాగే ఈ వివాదంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం స్పందించారు.. మిసా భారతి కుటుంబం చాలా రకాల అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని, కోర్టు వారిని శిక్షించిందనే విషయాలను మరచిపోతే ఎలాగని గుర్తు చేశారు..
బీజేపీ ప్రభుత్వ హయాంలో లాలూకు జైలు శిక్ష పడలేదని మిసా గుర్తుంచుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా వెల్లడించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం మిసా (అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం) కింద లాలూ ప్రసాద్ యాదవ్ని జైలులో పెట్టింది. అయితే లాలుని అరెస్ట్ చేయించిన కాంగ్రెస్ పై శపథం చేసిన ఆయన.. ఆ పార్టీని నాశనం చేస్తానన్నారు. అందుకే తమ కుమార్తెకు మిసా అనే పేరు పెట్టారని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఎద్దేవా చేశారు..