ఓ రైతు ఖాతాలోకి ఏకంగా రూ.కోటి జమ కావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఈ ఘటన బిహార్(Bihar) రాష్ట్రంలో భాగల్పూర్ జిల్లా(Bhagalpur District)లో చోటుచేసుకుంది. గోపాల్పూర్ గ్రామానికి చెందిన 75ఏళ్ల రైతు సందీప్ మండల్ వృద్ధాప్య పింఛను ఖాతాలోకి రూ.కోటి వచ్చింది.
సందీప్ మండల్‌కు ఎస్బీఐలో ఖాతా ఉంది. అయితే, తన కొడుకును పాస్‌బుక్ అప్డేట్ చేయడానికి పంపాడు. ఇక బ్యాలెన్స్ చూసే సరికి అది కోటి దాటింది. ఆ తర్వాత బ్యాంకు అతడి ఖాతాను స్తంభింపజేసింది. శుక్రవారం ఉదయం, రైతు స్వయంగా సైబర్ పోలీస్ స్టేషన్ చేరుకుని ఈ మొత్తం విషయాన్ని పోలీసులకు తెలిపాడు.
ఆయన కొడుకు బ్యాంకుకు చేరుకోగానే ఎక్కడి నుంచో రూ.కోటి ఖాతాలో పడ్డాయని తెలిసింది. బ్యాంకు మేనేజర్ ఆరా తీశా నుంచి పూర్తి సమాచారం తీసుకున్నట్లు రైతు తెలిపారు. సైబర్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసి అక్కడి నుంచి నివేదిక అందిన తర్వాత ఖాతా తెరుస్తామని బ్యాంకు మేనేజర్ తెలిపారు.
కాగా, రైతు సందీప్ మండల్ మాట్లాడుతూ.. ఇంత భారీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదని తెలిపారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నుంచి వృద్ధాప్య పింఛన్ తన ఖాతాలోకి వస్తుందని, అయితే, ఆగస్టు నెల నుంచి తన పాస్‌బుక్‌ను అప్డేట్ చేయనందున ఓసారి తన కుమారున్ని బ్యాంకుకు పంపినట్లు తెలిపాడు.