Telugu News » Bird Flu: బర్డ్‌ ఫ్లూ కలకలం.. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత..!

Bird Flu: బర్డ్‌ ఫ్లూ కలకలం.. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత..!

ఏపీ(AP)లోని నెల్లూరు జిల్లా(Nellore District)లో బర్డ్‌ఫ్లూ(Bird Flu) కలకలం రేపింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్నాయి.

by Mano
Bird Flu: Bird flu outbreak.. Thousands of chickens died..!

ఏపీ(AP)లోని నెల్లూరు జిల్లా(Nellore District)లో బర్డ్‌ఫ్లూ(Bird Flu) కలకలం రేపింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. దాంతో పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌ను భోపాల్‌లోని టెస్టింగ్‌ కేంద్రానికి పంపించారు.

Bird Flu: Bird flu outbreak.. Thousands of chickens died..!

నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్‌ ఫ్లూతోనే కోళ్లు మృత్యువాతపడుతున్నట్లు జిల్లా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. వ్యాధి ప్రబలిన ప్రాంతాల నుంచి 15రోజుల వరకు కోళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, బయట నుంచి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్‌ షాపులు మూసివేయాలని సూచించారు. ‍అదేవిధంగా కిలోమీటర్‌ పరిధిలో ఉన్న చికెన్‌ షాపులు మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. మృత్యువాతపడిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచనలు చేశారు. అదేవిధంగా బర్డ్‌ ఫ్లూపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

మరోవైపు, బర్డ్‌ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు కూడా సోకుతుందని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. . గాలిద్వారా ఈ వ్యాధి మనుషులకు వస్తుందని చెబుతున్నారు. గతంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాధి సోకి లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. విదేశీ పక్షులు వచ్చే సరస్సులు ఉన్న జిల్లాలను కూడా అలర్ట్‌ చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.

You may also like

Leave a Comment