Telugu News » BJP Congress : పరువు తీసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్.. ఫెస్టివల్ ఆఫర్ పేరుతో కౌంటర్స్ ..!!

BJP Congress : పరువు తీసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్.. ఫెస్టివల్ ఆఫర్ పేరుతో కౌంటర్స్ ..!!

కేసీఆర్, కిషన్ రెడ్డి ముచ్చటిస్తున్నట్టు ఉన్న పిక్ పెట్టిన కాంగ్రెస్.. మెగా డీల్.. దోస్తీ స్పెషల్ ఆఫర్ స్కామ్ అండ్ షేర్ అంటూ ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్స్ మీరు మీరు పరువు తీసుకోవడం కాదు.. దేశాన్ని, రాష్ట్రాలను అవినీతి చీడ నుండి కాపాడండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు..

by Venu
BJP VS CONGRESS

మిగతా రంగాలలో కంటే.. రాజకీయ రంగంలో రాణించాలంటే ఆలోచనలు షార్ప్ గా.. ప్రత్యర్థుల మాటలకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వడంలో దిట్టగా.. ఉండాలని నిరూపిస్తున్నారు నేతలు అని పొలిటికల్ వార్ చూస్తున్న వారు అనుకుంటున్నారు.. అసలే ఎన్నికలు.. అందులో క్రిటికల్ పొజిషన్.. పదవి దక్కించుకోవాలంటే ఆ మాత్రం చరిష్మా ప్రదర్శించకపోతే ఉనికికే ప్రమాదం.. ఇవే నేతల ఆలోచనలకి, మాటలకి మూలకారణం అవుతున్నాయని మరికొందరు అనుకుంటున్నారు.

 

మరోవైపు అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. సోషల్ మీడియాలో (Social Media) చురుగ్గా ఉంటూనే మాటకు మాట సమాధానాలు.. పంచుల రూపంలో ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోపణలు, విమర్శలు, అవినీతి, ఇతర పార్టీల దోస్తీపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దీపావళి పండగ (Diwali festival) సందర్భంగా.. కిలో గోధుమ పిండిని రూ.27.50కి అందించే పథకానికి శ్రీకారం చుట్టినట్టు ప్రకటించిన విషయ తెలిసిందే..

మరో వైపు దీవాళి స్పెషల్ ఆఫర్.. డిసెంబర్ 3న కాంగ్రెస్ ఎమ్మెల్యే (MLA) సేల్.. 30 పర్సెంట్ డిస్కౌంట్ టు కల్వకుంట్ల ఫ్యామిలీ.. అని కేసీఆర్ (KCR) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉన్న ఫోటోను బీజేపీ (BJP) షేర్ చేసింది. కాగా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అయితే తాజాగా బీజేపీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ (Congress) ఊహించని కౌంటర్ ఇచ్చింది.

కేసీఆర్, కిషన్ రెడ్డి ముచ్చటిస్తున్నట్టు ఉన్న పిక్ పెట్టిన కాంగ్రెస్.. మెగా డీల్.. దోస్తీ స్పెషల్ ఆఫర్ స్కామ్ అండ్ షేర్ అంటూ ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్స్ మీరు మీరు పరువు తీసుకోవడం కాదు.. దేశాన్ని, రాష్ట్రాలను అవినీతి చీడ నుండి కాపాడండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు..

You may also like

Leave a Comment