Telugu News » BJP : ఖాతా తెరిచిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో తొలి విజయం..!

BJP : ఖాతా తెరిచిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో తొలి విజయం..!

కాంగ్రెస్‌ నుంచి ఆయనకు ప్రత్యామ్నాయంగా వేసిన మరో నామినేషన్‌ కూడా చెల్లనిదిగా ప్రకటించారు. మరోవైపు ఇదే స్థానం నుంచి నామినేషన్లు వేసిన మరో 8 మంది సైతం ఉపసంహరించుకున్నారు.

by Venu
AP BJP: Visakha seat lost.. BJP ranks reached Delhi..!

గత కొన్ని రోజులుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్న పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) పోరులో మొత్తానికి బీజేపీ (BJP) మొదటి ఖాతా తెరిచింది. గుజరాత్ (Gujarat), సూరత్ (Surat) పార్లమెంట్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన ఎంపీ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో పోటీ నుంచి ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అదీగాక నేడు మిగతా అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకొన్నారు.. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి ముకేష్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదిలా ఉండగా ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ (Congress) తరఫున పోటీ చేస్తున్న నీలేశ్‌ కుంభనీ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

కాంగ్రెస్‌ నుంచి ఆయనకు ప్రత్యామ్నాయంగా వేసిన మరో నామినేషన్‌ కూడా చెల్లనిదిగా ప్రకటించారు. మరోవైపు ఇదే స్థానం నుంచి నామినేషన్లు వేసిన మరో 8 మంది సైతం ఉపసంహరించుకున్నారు. కాగా పోటీలో ముకేశ్‌ దలాల్‌ ఒక్కరే మిగలడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుందని తెలుస్తోంది.. అయితే ఈసీ నుంచి అధికార ప్రకటన రావలసి ఉంది. కాగా ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయానికి ఇది మొదటి మెట్టుగా పేర్కొన్నారు.. మోడీ (Modi) నాయకత్వంలో గుజరాత్‌ సహా దేశవ్యాప్తంగా 400 స్థానాలతో కమలం జయభేరీ మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. మరోవైపు బీజేపీ ఓటమి లక్ష్యంగా గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. 26 స్థానాలకు గాను కాంగ్రెస్ 24 స్థానాల్లో, మిగతా రెండు స్థానాలు అయిన భావ్‌నగర్, భరూచ్‌లో ఆప్ పోటీ చేస్తోంది.

You may also like

Leave a Comment