Telugu News » BJP : రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్ల కోసం బీజేపీ ఖతర్నాక్ ప్లాన్..!!

BJP : రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్ల కోసం బీజేపీ ఖతర్నాక్ ప్లాన్..!!

క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలు, హోర్దింగ్స్లతో పాటు మరిన్ని మార్గల్లో ప్రచారం చేయాలని కమలం నేతలు నిర్ణయించారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయిన అధిష్టానం.. పార్టీలో చేరికలు పై కూడా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

by Venu
BJP Scores 3/3 In Heartland, Telangana Consolation For Congress

తెలంగాణ (Telangana)లో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ (BJP) వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు కసరత్తు ప్రారంభించింది. అందుకు వివిధ కమిటీలను వేసి వారికి మార్గ నిర్దేశం చేసింది. పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) షెడ్యూల్ మార్చి ఒకటి తర్వాతనే వస్తుందనే అభిప్రాయంతో ఉన్న నేతలు.. ఈ లోపల మైలేజ్ పెంచుకొని సిద్దం అవ్వడానికి ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

bjp-big-plans-for-parliament-elections

ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలు, హోర్దింగ్స్‎లతో పాటు మరిన్ని మార్గల్లో ప్రచారం చేయాలని కమలం నేతలు నిర్ణయించారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయిన అధిష్టానం.. పార్టీలో చేరికలు పై కూడా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కేసీఆర్ (KCR) కుటుంబం అవసరం తెలంగాణ ప్రజలకి లేదని భావిస్తున్న బీజేపీ నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్‎ (Congress)కు మధ్యనే పోటీ ఉండనుందనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.. అయితే బీజేపీ కార్యక్రమాలు, నేతల మాటలు బట్టి చూస్తే మార్చి మొదటి వారం తరువాతే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈమేరకు గెలుపుకోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని అనుకొంటున్న తెలంగాణ బీజేపీ నేతలు.. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారని సమాచారం.. ఇప్పటికే 17 లోక్‌సభ స్ధానాలను నాలుగు క్లస్టర్స్‌గా విభజించిన పువ్వు పార్టీ.. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బస్సు యాత్ర చేయనుంది. 11 రోజుల పాటు సాగే ప్రచారంలో, రోడ్ షోలతో పాటు.. కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలు నిర్వహించనుంది..

You may also like

Leave a Comment