Telugu News » BJP MP America tour: బండి సంజయ్‌ పదిరోజులు అమెరికాలోనే… ఎందుకంటే?

BJP MP America tour: బండి సంజయ్‌ పదిరోజులు అమెరికాలోనే… ఎందుకంటే?

ఓ తెలుగు అసోసియేషన్ వార్షికోత్సవానికి హాజరుకావడానికి వెళ్తున్న సంజయ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గోంటారు.

by Prasanna
Bandi_Sanjay_kumar_profile_picture

బీజెపీ ఎం బండి సంజయ్ (Bandi Sanjay) పదిరోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. రేపు అమెరికా బయలుదేరే బండి సంజయ్ మళ్లీ తిరిగి స్వదేశానికి సెప్టెంబర్ 10 న చేరుకుంటారు. ఈ పది రోజుల పాటు అమెరికా(America) లోని పలు రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. ఓ తెలుగు అసోసియేషన్ వార్షికోత్సవానికి హాజరుకావడానికి వెళ్తున్న సంజయ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గోంటారు.

Bandi_Sanjay_kumar_profile_picture

 

ఈ ఏడాది సెప్టెంబర్ 2న యూఎస్ లోని అట్లాంటాలో ఆప్తా (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) వార్షికోత్సవం జరగనుంది. ఇది ఆ సంస్థకు 15వ వార్షికోత్సవం. ఇందులో ఎంపీ బండి సంజయ్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలకు వెళ్లే బీజేపీ ఎంపీ అక్కడ పలు సంఘాలతో సమావేశం కానున్నారు. వారు నిర్వహించే పలు చర్చ కార్యక్రమాలు,ఇష్టాగోష్టిలలో పాల్గొనున్నారు.

ఏం చేస్తారంటే…

ఆప్తా (APTA) వార్షికోత్సవ సమావేశాలతో పాటు బండి సంయ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ వంటి రాష్ట్రాలతో పాటు మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన పర్యటించనున్నారు. అమెరికా పర్యటన సందర్భంగా అక్కడున్న పలు ఎన్ఆర్ఐ సంఘాలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, కళా, సినీ, సాహిత్య, వైద్య, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాల్లో పాల్గొననున్నారు.

అమెరికాలో ఆప్తా…

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ పేరిట అమెరికాలో స్థిరపడిన తెలుగువారు 2008లో దీన్ని ప్రారంభించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారందరినీ ఒక వేదికమీదకు తెచ్చేందుకు ఆప్తా కృషిచేస్తుంది. తెలుగువారి కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించడమేకాకుండా… విద్యార్థులకు పలు రకాల స్కాలర్ షిప్ లను కూడా అందిస్తుంది.

You may also like

Leave a Comment