Telugu News » BJP: బీజేపీ మూడో విడత జాబితా విడుదల…!

BJP: బీజేపీ మూడో విడత జాబితా విడుదల…!

అంతకు ముందు రెండో విడతల్లో 53 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలను బీజేపీ బరిలోకి దింపింది.

by Ramu
bjp released mla candidates third list for telangana assembly elections 2023

తెలంగాణలో బీజేపీ (BJP) తరఫున పోటీ చేసే మూడో విడత అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. మొత్తం 35 మంది అభ్యర్థుల (Candidates)తో మూడో విడత జాబితాను బీజేపీ విడుదల చేసింది. అంతకు ముందు రెండో విడతల్లో 53 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలను బీజేపీ బరిలోకి దింపింది.

bjp released mla candidates third list for telangana assembly elections 2023

కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎంపీ బండి సంజయ్‌ను బరిలో ఉన్నారు. ఇక సోయం బాపు రావు బోథ్ నుంచి, ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి బరిలో దిగారు. ఈ జాబితాలో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి సనత్ నగర్ నుంచి టికెట్ కేటాయించారు. అదే సమయంలో ఉప్పల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ను అభ్యర్థిగా ప్రకటించింది.

ఇక సీఎం కేసీఆర్ కి పోటీగా కామా రెడ్డి నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని ఇంకా బీజేపీ వెల్లడించలేదు. తాజా జాబితాలో బాన్సువాడ నుంచి యెండల లక్ష్మీనారాయణ, అందోల్‌ (ఎస్సీ) నియోజక వర్గం నుంచి పల్లి బాబూమోహన్‌, నారాయణ్‌ఖేడ్‌ – జనవాడె సంగప్ప, జడ్చర్ల నుంచి చిత్తరంజన్‌ దాస్‌ ఉన్నారు.

ఇక బోధన్‌ నుంచి వడ్డి మోహన్‌రెడ్డి, మంచిర్యాల నుంచి వీరబెల్లి రఘునాథ్‌ , ఆసిఫాబాద్‌ (ఎస్టీ)నుంచి అజ్మీరా ఆత్మారాం నాయక్‌, మంథని నుంచి చందుపట్ల సునీల్‌రెడ్డి, జహీరాబాద్‌ (ఎస్సీ) నుంచి రామచంద్ర రాజ నరసింహా, మెదక్‌ నుంచి పంజా విజయ్‌కుమార్‌, ఎల్బీనగర్‌ నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్‌ నుంచి తోకల శ్రీనివాస్‌రెడ్డి బరిలో ఉన్నారు.

మలక్‌పేట్‌ నుంచి శ్యామ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి, అంబర్‌పేట నుంచి కృష్ణ యాదవ్‌, జూబ్లీహిల్స్‌ నుంచి లంకల దీపక్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి మేకల సారంగపాణి,
చేవెళ్ల (ఎస్సీ) నుంచి కేఎస్‌ రత్నం, పరిగి నుంచి బోనేటి మారుతి కిరణ్‌ , ముషీరాబాద్‌ నుంచి పోస రాజు ,పరకాల నుంచి కాలి ప్రసాద్‌రావు, పినపాక (ఎస్టీ) నుంచి పొడియం బాలరాజు, పాలేరు నుంచి నున్న రవికుమార్‌ పోటీ చేస్తున్నారు.

సత్తుపల్లి (ఎస్సీ) నుంచి రామలింగేశ్వరరావు, నారాయణ్‌పేట్‌ నుంచి రతంగ్‌ పాండురెడ్డి, మక్తల్‌ నుంచి జలంధర్‌రెడ్డి, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి, అచ్చంపేట (ఎస్సీ) నుంచి దేవని సతీశ్‌ మాదిగ, షాద్‌నగర్‌ నుంచిఅండె బాబయ్య, దేవరకొండ (ఎస్టీ) నుంచి కేతావత్‌ లాలూ నాయక్‌, హుజూర్‌నగర్‌ నుంచి చల్ల శ్రీలతారెడ్డి
నల్గొండ నుంచి మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌, ఆలేరు నుంచి పడాల శ్రీనివాస్‌ ఉన్నారు.

You may also like

Leave a Comment