Telugu News » Gajendra Singh: నీటి పారుదలలో విప్లవాత్మక మార్పులు: కేంద్ర మంత్రి గజేంద్రసింగ్

Gajendra Singh: నీటి పారుదలలో విప్లవాత్మక మార్పులు: కేంద్ర మంత్రి గజేంద్రసింగ్

25వ అంతర్జాతీయ కాంగ్రెస్, 74వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంతర్జాతీయ సదస్సు విశాఖ వేదికగా గురువారం అంతర్జాతీయ సమావేశాలను ప్రారంభించారు. ఈ సదస్సు ఈనెల 8 వరకు జరగనుంది.

by Mano
Gajendra Singh Shekhawat: Revolutionary changes in irrigation: Union Minister Gajendra Singh

నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి (central minister) గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) అన్నారు. ఇరిగేషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ దేశాలకు భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.

Gajendra Singh Shekhawat: Revolutionary changes in irrigation: Union Minister Gajendra Singh

25వ అంతర్జాతీయ కాంగ్రెస్, 74వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంతర్జాతీయ సదస్సు విశాఖ వేదికగా గురువారం ప్రారంభించారు. ఈ సదస్సు ఈనెల 8 వరకు జరగనుంది. షెకావత్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ముఖ్య అతిథిగా ఈ సదస్సుకు హాజరయ్యారు. అదేవిధంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ, ఐసీఐసీడీ ప్రెసిడెంట్ డాక్టర్ రగబ్ రగబ్, వైస్ ప్రెసిడెంట్ వోహ్రా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సదస్సులో 90 దేశాల నుంచి అతిథులు, ఐసీఐడీ, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు, సభ్యులు హాజరయ్యారు. కేంద్ర జలసంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఐసీఐడీలోని 54 సభ్యదేశాలు, మరో 20అసోసియేట్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయరంగ సుస్థిరతకోసం ప్రత్యామ్నాయ నీటి వనరులను ఏవిధంగా వినియోగించుకోలన్న అంశాలపై ఈ సదస్సులో వ్యవస్థలను బలోపేతం చర్చిస్తున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. 2019లో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment