– కష్టపడి పనిచేద్దాం..
– ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం
– కాంగ్రెస్ శ్రేణులకు ఖర్గే దిశానిర్దేశం
– ఆలోచన సరే ఆచరణ ఏది?
– బలమైన మోడీని ఢీకొట్టే సత్తా కాంగ్రెస్ కు ఉందా?
– కలహాలతో సాగుతున్న కూటమిలో సఖ్యత ఏర్పడుతుందా?
– కర్ణాటక, తెలంగాణ గెలుపుతో హస్తం అతిగా ఊహించుకుంటుందా?
– అంత ప్రభావమే ఉంటే 3 ప్రధాన రాష్ట్రాల్లో ఎందుకు ఓడింది?
– అసలు, మోడీలాంటి ప్రజాధరణ ఉన్న నేత ఎవరున్నారు?
మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే వ్యూహాల్లో ఉంది బీజేపీ (BJP). ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగకూడదని ప్రణాళికలు రచిస్తోంది హస్తం పార్టీ (Congress). ఈ నేపథ్యంలోనే రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు, ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, భారత్ న్యాయ యాత్ర సన్నాహాలపై చర్చించేందుకు ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఖర్గే (Kharge) మాట్లాడుతూ.. నేతలు, కార్యకర్తలంతా తమ విభేదాలను పక్కకు పెట్టి 2024 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతర్గత విషయాల గురించి మీడియా ఎదుట మాట్లాడవద్దని సూచించారు. పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తే లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించగలుగుతామని తెలిపారు. ఐక్యంగా ఉండి బీజేపీ అసత్య ప్రచారాలకు తగిన సమాధానం ఇవ్వాలని సూచనలు చేశారు.
అయితే.. కాంగ్రెస్ ఆశలు అతిగా ఉన్నయని బీజేపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. మోడీ అనే మహావృక్ష్యాన్ని కూల్చేందుకు కూటమి పేరుతో జట్టు కట్టిన పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎంత వరకు ప్రభావాన్ని చూపిస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నీడలో ఇతర పార్టీలు సఖ్యతగా ఉండడం కష్టమేనని చెబుతున్నారు. ఇప్పటికే లుకలుకలు మొదలయ్యాయని.. సీట్ల పంపకాల విషయంలో తన్నుకోవడం గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు. అయినా, మోడీ లాంటి ప్రజాధరణ ఉన్ననాయకుడ్ని ఢీకొట్టే రథసారధి కూటమిలో ఎవరున్నారనేది కమలనాథుల ప్రశ్న. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారని.. పైగా గాంధీ కుటుంబంపై రాచరిక ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఖర్గే, నితీశ్ లాంటి నేతలు.. ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమని.. మోడీలాంటి సమర్ధవంతమైన నాయకుడు కూటమిలో ఎవరూ లేరని అంటున్నారు.
నిజానికి, కర్ణాటక, తెలంగాణ గెలుపునకు వేరే కారణాలు ఉన్నాయి. అక్కడ సిద్ధరామయ్య, డీకే శివకుమార్, ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి బలమైన నాయకులు ఉన్నారు. మరి.. సెంట్రల్ లో విపక్ష కూటమికి ప్రజాకర్షక నేత ఎవరున్నారు?. పైగా, ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఏర్పడిన వ్యతిరేక కారణంగా వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్ గెలిచిందే తప్ప పుంజుకుందని అనుకోవడం కరెక్ట్ కాదనే వాదన జరుగుతోంది. అంతగా పుంజుకుని ఉంటే.. కర్ణాటక, తెలంగాణలో అమలు చేసిన వ్యూహాలను ఛత్తీస్ గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కూడా ప్రకటించారు. మరి.. ఆ రాష్ట్రాల్లో ఎందుకు గెలవలేదనే ప్రశ్న తెరపైకి వస్తోంది.