Telugu News » Aditya L1: తుది దశకు ఆదిత్య ఎల్-1.. అంతరిక్ష రక్షకుడిగా సేవలు..!

Aditya L1: తుది దశకు ఆదిత్య ఎల్-1.. అంతరిక్ష రక్షకుడిగా సేవలు..!

వచ్చే ఐదేళ్ల పాటు సూర్యుడి గుట్టును ఆదిత్య ఎల్-1 భూమికి చేరవేయనుంది. జనవరి 6 సాయంత్రం 4 గంటలకు శాటిలైట్ తన గమ్యస్థానానికి చేరుకుంటుందని ఇస్రో(ISRO) తెలిపింది.

by Mano
Aditya L1: Aditya L-1 for the final stage.. Services as a space protector..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1(Aditya L-1) ప్రయోగం తుది దశకు చేరుకుంది. వచ్చే ఐదేళ్ల పాటు సూర్యుడి గుట్టును ఆదిత్య ఎల్-1 భూమికి చేరవేయనుంది. జనవరి 6 సాయంత్రం 4 గంటలకు శాటిలైట్ తన గమ్యస్థానానికి చేరుకుంటుందని ఇస్రో(ISRO) తెలిపింది.

Aditya L1: Aditya L-1 for the final stage.. Services as a space protector..!

గతేడాది సెప్టెంబర్ 2న ప్రయాణం మొదలుపెట్టిన ఆదిత్య ఎల్-1, 126 రోజుల పాటు ప్రయాణించి నిర్దేశిత లాగ్రేజియన్ పాయింట్-1(L1)కి చేరనుంది. భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఎల్-1 పాయింట్ వద్ద హాలో కక్ష్యలో ఆదిత్య ఎల్-1 చేరనుంది. ఇక్కడ నుంచి ఆదిత్య ఎల్-1 పరికరాలు పనిమొదలు పెడతాయి.

ఆదిత్య ఎల్-1 సౌర తుఫానులపై నిఘా ఉంచి, అంతరిక్ష రక్షకుడిగా మారనుంది. అంతరిక్షంలో 50కి పైగా శాటిలైట్లు, రూ.50వేల కోట్ల విలువైన భారత ఆస్తులు ఉన్నాయిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. వీటిని రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సాధారణంగా సౌర తుఫానుల నుంచి వెలువడే ఛార్జ్ పార్టికల్స్, ప్రమాదకరమైన తరంగాలు అంతరిక్షంలోని శాటిలైట్స్, భూమిపై ఉన్న పవర్ గ్రిడ్స్‌పై ప్రభావం చూపిస్తాయి.

వీటిని ముందుగానే ఆదిత్య ఎల్-1 గుర్తించి శాటిలైట్‌ను రక్షిస్తుందని సోమనాథ్ వివరించారు. సూర్యుడిపై ఏర్పడే సౌర విద్యుదయస్కాంత ప్రభావాల గురించి ముందస్తుగా హెచ్చరిస్తుందని, మన ఉపగ్రహాలకు, కమ్యూనికేషన్ వ్యవస్థకు నష్ట కలగకుండా కాపాడుతుందన్నారు.

సౌర తుఫానులు దాటిపోయేంత వరకు మన శాటిలైట్లకు విఘాతం కలగకుండా, సేఫ్టీ మోడ్‌లో ఉంచేందుకు సాయపడుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌరజ్వాలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలపై అధ్యయనం చేస్తుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ తెలిపారు. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 సజావుగానే పనిచేస్తోందని వెల్లడించారు.

You may also like

Leave a Comment