కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బోధన్(Bodhan) పర్యటన నేపథ్యంలో ఆయన రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే నిజామాబాద్(Nijamabad), బోధన్ గోడలకు పోస్టర్లు ప్రత్యక్షం అయ్యాయి. సంచలనం సృష్టిస్తున్న పోస్టర్లలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫొటోలను పెట్టి వివాదాస్పద వ్యాఖ్యలను అందులో పేర్కొన్నారు.
ఈ పోస్టర్లను బోధన్‌లో బహిరంగంగా గోడలపై అతికించారు. కాంగ్రెస్‌కు ఓటువేసిన పాపానికి కరెంటు లేక అల్లాడుతున్న కర్ణాటక అని విమర్శలు ఉన్నాయి. కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా? అని ఉన్న ప్రశ్నలు సంధించారు. కర్నాటకలో ఉద్యోగాలు కాదు.. ఉరితాళ్లే అంటూ రాతలు రాశారు. రాహుల్ గాంధీ రాక నిరసిస్తూ వెలసిన పోస్టర్ల వెనుక బీఆర్ఎస్ నాయకులే ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
‘బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌దే. మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ..’ ‘కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే… ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేస్తూ పోస్టర్లలో రాశారు. కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టిన వైనాన్ని ముద్రించారు. పోస్టర్లలో బళ్లారిలో జీన్స్ పరిశ్రమలకు విద్యుత్తు కోతలపై పత్రికల్లో వచ్చిన కథనాలు ఉదహరించారు.
అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలో బహిరంగసభల్లో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తోంది. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు, మోడీ మూడు రోజుల పర్యటన నేపథ్యంలో ఆయన ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.