Telugu News » Bomb Threat: ‘అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తాం..’ బెదిరింపు మెయిల్ కలకలం..!

Bomb Threat: ‘అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తాం..’ బెదిరింపు మెయిల్ కలకలం..!

అయోధ్య రామమందిరాన్ని పేల్చేవేస్తామంటూ బాంబు బెదిరింపు కలకలం రేపింది. భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర తివారీకి చెందిన ఈ-మెయిల్ ఐడీకి కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది.

by Mano
Ayodhya: Consecration of Ayodhya Ramlalla.. Festivals in more than 50 countries..!

అయోధ్య(Ayodhya)లో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నూతన రామమందిరాన్ని(Rama mandir) పేల్చేవేస్తామంటూ బాంబు బెదిరింపులు(Bomb Therat) రావడం కలకలం రేపింది. భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర తివారీకి చెందిన ఈ-మెయిల్ ఐడీకి కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది.

Bomb Threat: 'Ayodhya Ram Mandir will be blown up..'

దీంతో దేవేంద్ర తివారీ తనకు వచ్చిన బెదిరింపు మెయిల్ స్క్రీన్ షాట్‌ను తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో పోస్ట్ చేశారు. యూపీ పోలీసులతోపాటు సీఎం యోగి, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులను ట్యాగ్ చేశారు. 2023 డిసెంబర్ 27వ తేదీన రైతు సంఘ నాయకుడు దేవేంద్ర తివారీకి పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న జుబేర్ ఖాన్ అనే వ్యక్తి ఈ-మెయిల్‌ పంపాడు.

దేవేంద్ర తివారీతోపాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్ఓఎఫ్ ఏడీజీ అమితాబ్ యాష్‌ను గోసేవకులుగా పేర్కొంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయోధ్య నూతన రామమందిరాన్ని కూడా బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. ఈ విషయంపై ప్రత్యేక దర్యాప్తును కోరారు. దేవేంద్ర తివారీ ఫిర్యాదు మేరకు లఖ్ నవూలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సహేంద్ర కమార్ కేసు నమోదు చేశారు.

బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తును మమ్మురం చేశారు. ఏటీఎస్, ఎస్ఓఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మెయిల్ పంపిన జుబేర్ ఖాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకుముందు కూడా తనకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయని దేవేంద్ర తివారీ తెలిపారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment