Telugu News » Breaking: అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు.. 3,300కిలోల మాదకద్రవ్యాలు స్వాధీనం..!

Breaking: అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు.. 3,300కిలోల మాదకద్రవ్యాలు స్వాధీనం..!

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు((Narcotics Control Bureau Narcotics Control Bureau) బుధవారం భారీగా మత్తు పదార్థాలను పట్టుకున్నారు. 3,300 కిలోల నార్కోటిక్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

by Mano
Breaking: International gang busted.. 3,300 kg of narcotics seized..!

అరేబియా సముద్రం(Arabian Sea)లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు((Narcotics Control Bureau Narcotics Control Bureau) బుధవారం భారీగా మత్తు పదార్థాలను పట్టుకున్నారు. గుజరాత్ తీరంలో మాదకద్రవ్యాల ముఠాపై దాడిచేసి 3,300 కిలోల నార్కోటిక్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

Breaking: International gang busted.. 3,300 kg of narcotics seized..!

గుజరాత్‌లోని పలు పోర్టు నుంచి మాదక ద్రవ్యాలు దిగుమతి అవున్నాయనే సమాచారం మేరకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అప్రమత్తమైంది. ఈ మేరకు భారత నౌకాదళం, లోకల్‌గా ఉండే తీరగస్తీ దళం సహకారంతో అక్రమంగా తరలిస్తున్న 3,300 కేజీల మాదక ద్రవ్యాలను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముందు గుజరాత్ తీరం వెంట అనుమానాస్పదంగా భారత జిల్లాల్లోకి ప్రవేశించిన ఇరాన్ పడవను అధికారులు ముట్టడించారు. ఆ బోట్‌లోని 3,089కేజీల చరస్, 158 కేజీల మేథపేటమిన్, 25 కేజీల మొర్ఫిన్ మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. పట్టుబడిన మత్తు పదార్థాల విలువ రూ.వేల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన బోట్, సిబ్బందిని భారత నౌకాశ్రయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు అప్పగించారు.

You may also like

Leave a Comment