Telugu News » Japan: జపాన్‌లో మళ్లీ తగ్గిన జననాల రేటు..!

Japan: జపాన్‌లో మళ్లీ తగ్గిన జననాల రేటు..!

జపాన్‌(Japan)లో జననాల సంఖ్య(Number of births) గణనీయంగా తగ్గిపోతోంది. 2023 సంవత్సరంలో 7లక్షల 58 వేల 631మంది జన్మించినట్లు వెల్లడించింది.

by Mano
Japan: The birth rate has decreased again in Japan..!

జపాన్‌(Japan)లో జననాల సంఖ్య(Number of births) గణనీయంగా తగ్గిపోతోంది. తాజాగా విడుదలైన నివేదికలో జనన రేటు(Birth rate) మరింత తగ్గింది. 2023 సంవత్సరంలో 7లక్షల 58 వేల 631మంది జన్మించినట్లు వెల్లడించింది. అయితే ఎనిమిదేళ్లలో జపాన్ జననాల సంఖ్యలో ఇదే అత్యల్ప సంఖ్య. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో జననాల సంఖ్య 5.1 శాతం తగ్గింది.

Japan: The birth rate has decreased again in Japan..!

మరోవైపు జపాన్‌ ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపడం లేదు. వివాహాల సంఖ్య 5.9శాతం తగ్గి 4 లక్షల 89 వేల 281కి చేరుకుంది. 90 ఏళ్లలో తొలిసారిగా వివాహాల సంఖ్య 5లక్షల కంటే తక్కువ పెళ్లిళ్లు జరిగాయి. ప్రస్తుత డేటా ప్రకారం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ 2070లో ఈ సంఖ్య మరింతగా 30శాతం తగ్గుతుందని అంచనా వేసింది.

అప్పుడు జపాన్ జనాభా 87 మిలియన్లకు పడిపోతుంది. దీంతో జపాన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. జనాభా వేగంగా పడిపోతున్న క్రమంలో తగు చర్యలు తీసుకుంటున్నట్లు జపాన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. పిల్లల సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువ కార్మికుల జీతాలు పెంచనున్నట్లు చెప్పారు.

జపాన్ క్యాబినెట్ మంత్రి యోషిమాసా హయాషి మాట్లాడుతూ జనన రేటు తగ్గుదల సమస్య చాలా తీవ్రమైనదని తెలిపారు. 2030 నాటికి యువత సంఖ్య పెరగకపోతే ఈ సంఖ్యను మార్చడం అసాధ్యంమని అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా మాట్లాడుతూ.. ప్రస్తుతం జననాల రేటు తమ దేశంలో అత్యంత తీవ్రమైన సంక్షోభమని వెల్లడించారు.

You may also like

Leave a Comment