తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి (Telangana Ex CM) కల్వకుంట్ల చంద్రశేఖర రావు(KCR) తీవ్రంగా గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి తన ఫామ్‌హౌస్(Farm House)లో ఉండగా బాత్రూంలో జారి కింద పడినట్లు సమాచారం. దీంతో కేసీఆర్‌కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి (Yashodha Hospital)కి కేసీఆర్‌ను ఆయన కుటుంబసభ్యులు తరలించినట్లు సమాచారం. కేసీఆర్ బాత్రూమ్కు వెళ్తుండగా ఆయన పంచె కాలుకు తగిలి కింద పడిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో కేసీఆర్ ఎడమ కాలు తుంటి ఎముక విరిగిపోయినట్లు తెలుస్తోంది.
అర్ధరాత్రి రెండున్నర గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ వెళ్లి అక్కడే ఉంటున్నారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్కు కేవలం 39 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా పరిమితమైంది. అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ‘బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ గారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎక్స్పర్ట్ వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రజలు, సన్నిహితుల మద్దతుతో నాన్న త్వరలోనే కోలుకుంటారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.’ అని కవిత ట్వీట్ చేశారు.
BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon.
Grateful for all the love 🙏🏼— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 8, 2023