కెనడా మాజీ ప్రధాని(Former Canadian Prime Minister) బ్రియాన్ ముల్రోనీ (84)(Brian Mulroney) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. బ్రియాన్ ముల్రోనీ గత సంవత్సరం ప్రారంభంలో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో చికిత్స పొందారు.
ఆ సమయంలో ఆయన అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారు. ఆయుధాల వ్యాపారితో చట్టవిరుద్ధమైన ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ముల్రోనీ అపవాదును మూటగట్టుకున్నారు.
బ్రియాన్ 1984లో కెనడియన్(Canadian) చరిత్రలో అత్యధిక మెజారిటీ(282 సీట్లలో 211) సీట్లను గెల్చుకుని బ్రియాన్ ముల్రోనీ 18వ ప్రధానమంత్రిగా పనిచేశారు. 1983లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వాన్ని గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
ముల్రోనీ ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో తెర వెనుక పనిచేశారు. 1976లో తదుపరి ఫెడరల్ ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ నాయకుడు కావడానికి ముందు న్యాయ పట్టా పొందారు. తర్వాత కన్జర్వేటివ్‌ల నుంచి వైదొలిగారు. అయినప్పటికీ, అతను జోయి క్లర్క్ నుంచి ఓటమిని చవిచూశారు. ఓటమి తర్వాత కూడా నిరాశ చెందలేదు.