రాష్ట్రంతో పాటు దేశాన్ని ఏలి చరిత్రలో నిలిచిపోదామనే కలలుకన్నారు.. కానీ పార్టీనే అధికారంలో లేకుండా పోతుందని అసలు ఊహించలేదు.. అధికారం పొగానే.. అవినీతి ఆరోపణలు కొదమ సింహంలా వెంటాడుతాయని భావించలేదు.. కాంగ్రెస్ (Congress)ను ఇరుకునపెట్టి.. ఎలాగో మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేద్దామనే ఆలోచనలో ఉన్న గులాబీ బాస్ ఒక్క సారిగా బలహీనపడటం చర్చాంశనీయంగా మారింది.
మొత్తానికి కేసీఆర్ (KCR) లోక్ సభ ఎన్నికల ప్రచారంపై అంత ఆసక్తిగా లేనట్లుగా కనిపిస్తోందంటున్నారు.. అసలు ఎన్నికలు వచ్చాయంటే కనిపించే హడావుడి.. హంగామా ఏది కూడా ఈసారి లేకపోవడం ఆయన ఈ ఎన్నికలను సింపుల్ గా ట్రీట్ చేస్తున్నారని అనుకొంటున్నారు.. అయితే పార్టీ నేతలు నిరాశకు గురికాకుండా.. కార్యకర్తల్లో జోష్ పడిపోకుండా బస్సు యాత్ర చేయాలని భావించినట్లు తెలుస్తోంది.
అయితే అడుగు కదపలేక ఈ యాత్రను కూడా ఆలస్యం చేయడం కనిపిస్తోంది. ఇక సోమవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలనుకున్నారు కానీ.. రెండు రోజుల వాయిదా తర్వాత ప్రారంభిస్తున్నట్లుగా సమాచారం.. ఇక 24 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుందని మే 10 వరకు కొనసాగుతుందని బీఆర్ఎస్ (BRS) నేతలు మాట్లాడుకోవడం కనిపిస్తోంది. మే 11వ తేదీ సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తుంది.
ఇక పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ (Telangana) సెంటిమెంట్ రగిలిస్తూ తిరుగులేకుండా అధికారాన్ని ఏలిన కేసీఆర్.. ప్రస్తుతం ఎప్పుడూ ఎదుర్కోనంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అదీగాక రెండు జాతీయ పార్టీల మధ్యనే పోరు జరుగుతోదంన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ గాలిపటానికి ఉన్న దారంలా కనిపిస్తుందని అంటున్నారు.. అందుకే ఓటర్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టించుకుంటారా అనే సందేహంలో ఉన్నారని అనుకొంటున్నారు..