Telugu News » BRS : వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీఆర్ఎస్.. !

BRS : వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీఆర్ఎస్.. !

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్‌ కడియం కావ్యకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె పార్టీకి రాజీనామా చేసి తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు..

by Venu
BRS

వరంగల్ (Warangal) పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) ఎంపీ అభ్యర్థిగా స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బరిలో నిలుస్తున్నారనే వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.. పార్టీ అధినేత ప్రకటించడమే తరువాయి అన్నటుగా గుసగుసలు గుప్పుమన్నాయి.. అయితే ఈ ఎంపికలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.. అంతా ఊహించినట్లుగా కాకుండా మరో వ్యక్తిని తెరమీదికి తీసుకురావడం.. ఆసక్తికరంగా మారింది..

ఇవాళ మీడియాలో రాజయ్యకు టికెట్ కు కన్ఫామ్ అయ్యిందని, కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్ నుంచి సైతం పిలుపు వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, చివరి నిమిషంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్‌ పేరును ప్రకటించారు. నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో జరిగిన భేటీలో వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై జోరుగా చర్చలు నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.

సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం. ఇక 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా ఉన్న ఆయన ఎంపిక సరైందనే నిర్ణయానికి వచ్చాక కేసీఆర్ ఈయన పేరు ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు. మరోవైపు మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ (Sudhir Kumar).. హన్మకొండ జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.

కాగా ఈయన ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా మొదట వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్‌ కడియం కావ్యకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె పార్టీకి రాజీనామా చేసి తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.. అనంతరం కాంగ్రెస్ లోకి వెళ్లారు.. తర్వాత తాటికొండ రాజయ్య పేరు తెరపైకి వచ్చింది.. కానీ ఆయన పెట్టుకొన్న ఆశలు నిరాశలైయ్యాయి..

You may also like

Leave a Comment