Telugu News » Delhi Liquor Scam : కవితకు మరింత బిగుస్తున్న ఉచ్చు.. కస్టడీకి స్పెషల్ కోర్టు గ్రీన్ సిగ్నల్..!

Delhi Liquor Scam : కవితకు మరింత బిగుస్తున్న ఉచ్చు.. కస్టడీకి స్పెషల్ కోర్టు గ్రీన్ సిగ్నల్..!

కస్టడీ సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను, తన తరుఫు లాయర్లను కలిసేందుకు కోర్టు కవితకు పర్మిషన్ ఇచ్చింది.

by Venu
mlc kavitha fire on congress and bjp

ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) విషయంలో వరుసగా ట్విస్ట్ మీద ట్విస్ట్ లు చోటు చేసుకొంటున్నాయి.. బెయిల్ కోసం అన్ని దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నా.. చిన్న అవకాశం కూడా చిక్కడం లేదని తెలుస్తుంది. కాగా ఇప్పటికే ఈ కేసులో ఈడీ (ED) ఆమెను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే..

Delhi-Liquor-Scamమరోవైపు నిన్న సీబీఐ (CBI) సైతం అరెస్ట్ చేసి నేడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది.. కేసులో మరింత పురోగతి కోసం ఆమెను విచారించాలని పేర్కొంది. ఇందుకు కవితను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. ఈ క్రమంలో కవిత కస్టడీపై వాదనలు జరిగాయి. ఆమె తరుఫు లాయర్లు ఈ అరెస్ట్ అక్రమంటూ వాదించగా.. లిక్కర్ స్కామ్ కేసులో కవితనే ప్రధాన సూత్రధారి అని సీబీఐ ఆరోపించింది.

ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజా సీబీఐ వాదనలతో ఏకీభవించారు. ఈ మేరకు కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్వర్వులు ఇచ్చారు.. ఈ నేపథ్యంలో 15వ తేదీ వరకు ఆమెను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను అధికారులు ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు.

మూడు రోజుల పాటు ఇక్కడే విచారించనున్నారని సమాచారం.. అదేవిధంగా కస్టడీ సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను, తన తరుఫు లాయర్లను కలిసేందుకు కోర్టు కవితకు పర్మిషన్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది.

You may also like

Leave a Comment