Telugu News » Ponnala Lakshmaiah : నన్ను కనీసం ఏడాదిపాటైనా సీఎంగా ఉండనివ్వండి కేసీఆర్..!!

Ponnala Lakshmaiah : నన్ను కనీసం ఏడాదిపాటైనా సీఎంగా ఉండనివ్వండి కేసీఆర్..!!

పలువురు నెటిజన్లు లక్ష్మయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఇందులో నిజమెంతని ఆరా తీస్తున్నారు. కాగా ఎన్నికలకు ముందు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ (Congress)ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో హస్తాన్ని విడకుండా ఉంటే కనీసం ఏదో ఒక పదవి అయినా దక్కేది అనే బాధలో పొన్నాల ఇలా ప్రవర్తించారు కావచ్చు అని కొందరు అనుకొంటున్నారు..

by Venu

ప్రమాదవశాత్తు జారిపడి కాలు తుంటి విరగటంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)ను.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే.. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. అనారోగ్యం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో బద్ద శత్రువుల్లా వ్యవహరించి ఆపద సమయంలో.. కేసీఆర్‌కు అందుతున్న చికిత్స గురించి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవపై సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.

రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) చొరవ తీసుకొని కేసీఆర్ పట్ల స్నేహంగా ప్రవర్తించిన విధానం పై పలువురు నెటిజన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.. రాజకీయాల్లో ఇది మంచి పరిణామం అని కామెంట్స్ కూడా పోస్టు చేశారు.. అయితే రాజకీయాలను వ్యక్తిగత కక్షగా మలచుకొనే వారు కూడా ఉన్నారు..

మరోవైపు రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ని కలిసిన విషయం పై బీఆర్ఎస్ (BRS) నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.. పొన్నాల లక్ష్మయ్య.. రేవంత్ రెడ్డి పరామర్శ ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకొని సెటైరికల్ క్యాప్షన్ ఇచ్చారు. ‘నన్ను కనీసం ఏడాదిపాటైనా సీఎంగా ఉండనివ్వండి కేసీఆర్ గారు’ అంటూ వేడుకుంటున్నట్టు పొన్నాల లక్ష్మయ్య పేరుతో ఉన్న ఈ వాట్సాప్ స్టేటస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో పలువురు నెటిజన్లు లక్ష్మయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఇందులో నిజమెంతని ఆరా తీస్తున్నారు. కాగా ఎన్నికలకు ముందు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ (Congress)ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో హస్తాన్ని వీడకుండా ఉంటే కనీసం ఏదో ఒక పదవి అయినా దక్కేది అనే బాధలో పొన్నాల ఇలా ప్రవర్తించారు కావచ్చు అని కొందరు అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment