Telugu News » KCR : చాలా రోజుల తర్వాత రంగంలోకి కేసీఆర్… ఉద్యమ నేతను గుర్తుకు తెస్తారా…..!

KCR : చాలా రోజుల తర్వాత రంగంలోకి కేసీఆర్… ఉద్యమ నేతను గుర్తుకు తెస్తారా…..!

ఇప్పటికే పులి ఎంటర్ అవుతోంది...ఇక అసలైన ఆట మొదలవుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

by Ramu

బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) చాలా రోజుల తర్వాత రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే పులి ఎంటర్ అవుతోంది.. అసలైన ఆట మొదలవుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పదేండ్ల తర్వాత కేసీఆర్‌ లో మరోసారి ఉద్యమ నేతను చూడబోతున్నారని అంటున్నారు. ఇన్నాళ్లూ అధికారాన్ని అనుభవించిన ఆయన.. ఇప్పుడు ప్రతిపక్ష నేత పాత్ర పోషించనున్నారు.

brs parliamentary party meeting tomorrow topics to be discussed are

ఓటమి తర్వాత ఫాంహౌస్ లో కిందపడి ఆస్పత్రిలో చేరిన ఆయన.. తర్వాత ఆపరేషన్ వల్ల ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. ఆయన కోలుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. బీఆర్ఎస్ ఎంపీలకు సమాచారం అందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు.

ఎలా ముందుకెళ్లాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు, త్వరలో జరగబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థుల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఇన్నాళ్లూ యాక్టివ్ గా లేకపోవడంతో పార్టీలోనూ ఓటమి నిరాశ పోలేదు. క్యాడర్ ఇంకా నిరుత్సాహంలోనే ఉంది.

కాంగ్రెస్ సర్కార్ పై విమర్శల దాడితో, అండగా ఉంటామనే భరోసా మాటలతో వారిలో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నా.. కేసీఆర్ ఎప్పుడు రంగంలోకి దిగుతారా? అని ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుండడంతో సంబరాల్లో ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు.

You may also like

Leave a Comment