Telugu News » Tripti Dimri Animal Movie: మా జర్నీ అంత ఈజీ కాదు.. స్టార్ హీరోయిన్..!

Tripti Dimri Animal Movie: మా జర్నీ అంత ఈజీ కాదు.. స్టార్ హీరోయిన్..!

‘యానిమల్’ హీరోయిన్‌ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) దిల్లీలో ఓ ఈవెంట్‌లో ఆసక్తికర విషయాలను పంచుకుంది. జోయ పాత్ర ఫేమస్ అవుతుందని ఊహించలేదని తెలిపింది.

by Mano
Tripti Dimri Animal Movie: Our journey is not so easy.. star heroine..!

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) తెరకెక్కించిన రణ్ బీర్ కపూర్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’((Animal Movie). ఇందులో సెకండ్ హీరోయిన్‌గా నటించిన త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా దిల్లీలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ భామ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Tripti Dimri Animal Movie: Our journey is not so easy.. star heroine..!

‘‘మా ఇండస్ట్రీ జర్నీ ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. ఎత్తుపల్లాలు ఉంటాయి. అన్నింట్లో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. యానిమల్ సినిమాతో మంచి ఆదరణ లభించింది. మూవీ బ్లాక్‌బస్టర్ అవుతుందని ముందే తెలుసు. కానీ, నా క్యారెక్టర్ ఇంత ఫేమస్ అవుతుందని ఊహించలేదు. ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. వాళ్లందరికీ నేను కృతజ్ఞురాలిని. రోజూ నిద్రపోయే ముందు యానిమల్ మూవీ టీమ్‌ను గుర్తుచేసుకొని థాంక్స్ చెబుతున్నా. జోయ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా’అని త్రిప్తి చెప్పుకొచ్చింది.

అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. రాత్రి రాత్రే లక్షల ఫాలోవర్లను దక్కించుకుందీ బ్యూటీ. మరోవైపు ఈ అమ్మడుతో సినిమా చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలు క్యూకడుతున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న గ్రాండ్‌గా విడుదలైంది.

పాన్‌ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ సినిమాలో మరో హీరోయిన్. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.800కోట్ల వసూళ్లను రాబట్టి ప్రస్తుతం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. రిపబ్లిక్‌డే సందర్భంగా ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్ కానుంది.

You may also like

Leave a Comment