ఒక్క ఓటమి బీఆర్ఎస్ (BRS) ఉనికికే ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే వలసలను ఆపలేక.. లోక సభ సమరానికి అభ్యర్థులు దొరక్క అల్లాడుతున్న కారు పార్టీకి మరో షాక్ తగిలింది. దాదాపు 23 ఏండ్ల పాటు తెలంగాణ (Telangana) ఉద్యమం.. అధికారంలో ఉన్న పదేండ్లు కలిపి ఏనాడు ఇంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోలేదనే టాక్ వినిపిస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో పార్టీలో చేరేందుకు ఇప్పటికే వారు హైదరాబాద్ (Hyderabad)కు చేరుకొన్నారని చర్చించుకొంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డితో కొంతకాలంగా టచ్లో ఉన్న మార్నేని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ఈ దంపతులను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం వద్దకు తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.
గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రధాన అనుచరుడిగా ఉన్న మార్నేని అసెంబ్లీ ఎన్నికల అనంతరం నుంచి పార్టీ మారుతాడన్న ప్రచారం జరుగుతోంది. అదీగాక బీఆర్ఎస్ కి అంటి ముట్టనట్లుగా వ్యవహరించడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చింది. అయితే ఆ సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్రావు పలుమార్లు మార్నేనితో చర్చలు జరిపినట్లుగా సమాచారం. కానీ చివరికి పార్టీ మార్పునకే జై కొట్టారు..
 
			         
			         
														