Telugu News » Telangana : తెలంగాణలో 420 సెగలు.. కాంగ్రెస్ ఎదురుదాడి

Telangana : తెలంగాణలో 420 సెగలు.. కాంగ్రెస్ ఎదురుదాడి

రాష్ట్రంలో నెంబర్ వన్ 420 ఎవరంటే కేసీఆర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలనే అమలు చేయడం ప్రామాణికం అయితే.. కేసీఆర్ పెద్ద 420 అని మండిపడ్డారు.

by admin
congress-leaders-are-criticizing-brs-leaders

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవక ముందే బీఆర్ఎస్ (BRS) విడుదల చేసిన బుక్ లెట్ చర్చనీయాంశమైంది. హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు దీనిపై మండిపడుతున్నారు. పట్టుమని నెల రోజులు కూడా అవ్వకముందే ఇంతలా దిగజారి విమర్శలు చేయడం తగదని.. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.

congress-leaders-are-criticizing-brs-leaders

తాము అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండా తమ పరిపాలనపై బురద జల్లడం బీఆర్‌ఎస్‌ నాయకులకు సరికాదని మంత్రి శ్రీధర్‌ బాబు హితవు పలికారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను నిర్దేశించిన సమయంలో అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుంటే బీఆర్​ఎస్​ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో నెంబర్ వన్ 420 ఎవరంటే కేసీఆర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలనే అమలు చేయడం ప్రామాణికం అయితే.. కేసీఆర్ పెద్ద 420 అని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో అట్టడుగు వర్గాలు అయిన దళితులను మోసం చేసింది కేసీఆర్ అని, ఇక్కడి నుంచే మోసం మొదలైందని వివరించారు. 3 ఎకరాల భూమి ఏమైంది అని గుర్తుచేశారు.

టీఆర్ఎస్ నుంచి తెలంగాణ ఎప్పుడు అయితే తొలగించారో అప్పుడే తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు బీఆర్ఎస్ నేతలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రంలో తెచ్చిన ప్రతి చట్టానికి మద్దతు ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్సీ కవితను ఏవిధంగా కాపాడారో కేసీఆర్ కూడా అలానే కాపాడుదాం అనుకుంటున్నారా అంటూ కిషన్ రెడ్డిని నిలదీశారు. కేసీఆర్ కమీషన్ వల్లే తెలంగాణ లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, జ్యూడీషియల్ ఎంక్వైరీ పారదర్శకంగా జరుగుతుందన్నారు జీవన్ రెడ్డి.

You may also like

Leave a Comment