చంద్రబాబు అరెస్టు విషయంలో తాను ఎందరో నిపుణు లతో మాట్లాడాలని అందరూ చంద్రబాబు (Chandrababu) అరెస్టు దుర్మార్గం అని అంటున్నారని టీడీపీ (TDP) సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు. తప్పు చేసి ఉంటే చంద్రబాబుని అరెస్టు చేయొచ్చు కానీ కేవలం జగన్ (Jagan) కక్ష సాధింపు కోసమే చంద్రబాబుని అరెస్టు చేశారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…..
సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత కంపెనీల ద్వారా ప్రజల డబ్బును దోచుకున్నారని అప్పటి ప్రభుత్వం పక్కా ఆధారాలతో జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. కానీ ఇప్పుడు జగన్ మాత్రం కక్ష సాధింపుతోనే తెలుగుదేశం పార్టీ ని ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబుని అరెస్టు చేశారు.
సీఐడీ వాళ్ళు ఆడిటర్ ను తెస్తే నిజాలు చెప్తాను అని చెప్పిన ధైర్యవంతుడు చంద్రబాబు నాయుడు.నాకు న్యాయవ్యవస్థ మీద ఉన్న గౌరవం చంద్రబాబు అరెస్ట్ తో పోయింది. చంద్రబాబు కేసుపై ఇచ్చిన తీర్పు దారుణం. జడ్జి పొజిషన్ లో ఉంటే ఏదైనా చేయవచ్చు అని అనుకుంటున్నారా? జడ్జి తనకు ప్రాణహాని ఉందని చెప్పారా? గన్ మేన్స్ ని ఎందుకు ఇచ్చారు.
చంద్రబాబుపై ఇచ్చిన జడ్జి మెంట్ చాలా తప్పు. చంద్రబాబుని రిమాండ్ కు పంపడం చాలా దుర్మార్గం. జగన్ మోహన్ రెడ్డి వ్యవస్థలని చాలా బాగా మేనేజ్ చేసారు.
చంద్రబాబు అరెస్ట్ చాలా తప్పు. ఆయనపై తప్పుడు తీర్పు ఇస్తే మేం చూస్తూ ఊరుకోవాలా? తీర్పు ఇచ్చిన జడ్జి ఫోన్ డేటా చెక్ చేయాలి. బ్యాంకు అకౌంట్ లు చెక్ చేయాలి. సీసీ కెమెరాలు అన్ని చెక్ చేయాలి. ముగ్గురు సుప్రీం కోర్టు నాయమూర్తులను చంద్రబాబు కేసుకు నియమించాలని కోరుకుంటున్నాం.