Telugu News » Yash Next movie : ఎట్టకేలకు గీతూ మోహన్ కథకు యస్ చెప్పిన యష్..!

Yash Next movie : ఎట్టకేలకు గీతూ మోహన్ కథకు యస్ చెప్పిన యష్..!

యష్(Yash)..కొంత కాలం క్రితం కన్నడలో సీరియల్ హీరో.నెమ్మదిగా హీరో ఛాన్స్ లు పట్టాడు. చిన్నపాటి హీరోగా చలామణి అవుతూ వచ్చాడు.

by sai krishna

యష్(Yash)..కొంత కాలం క్రితం కన్నడలో సీరియల్ హీరో.నెమ్మదిగా హీరో ఛాన్స్ లు పట్టాడు. చిన్నపాటి హీరోగా చలామణి అవుతూ వచ్చాడు.అలాంటి టైమ్ లో ప్రశాంత్ నీల్ అనే విజనరీ డైరెక్టర్ కంట్లో పడ్డాడు. కట్ చేస్తే కేజీఎఫ్(KGF). కొడితే ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ కుంభస్థలం బద్దలైంది.

యష్ పేరు దేశమంతటా మారుమోగింది. మాకు హీరో దొరికేశాడని యాక్షన్ కథలన్నీ మురిసిపోయాయి. చాలా మంది డైరెక్టర్లు యష్ చుట్టు ప్రదక్షిణలు చేశారు. ఈ లిస్ట్ లో దంగల్ సినిమాని డైరెక్టర్ నితీష్ తివారి కూడా ఉన్నాడని టాకు. యష్ క్రేజ్ ఏ రేంజ్ కు ఎగబాకిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే యష్ మాత్రం ఛాన్స్ తీసుకోలేదు.

తనకు కంటెంట్ నచ్చితేనే ‘యాక్షన్ –కట్ ‘ లు ఉంటాయని తెగేసి చెప్పేస్తున్నాడు. సో కేజీఎఫ్‌ తెచ్చిన స్టార్ డమ్ ని కాపాడుకోవడం యశ్ కి టాస్క్ అయిపోయింది. తొందరపడి సినిమాలు ఒప్పేసుకుంటే దొరికేస్తామనే డిఫెన్స్ లో నెక్ట్స్..నెక్స్ట్ అంటూ నెలలు గడిపేస్తున్నాడని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి.

అయితే ఫైనల్‌గా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌(Geethu Mohan)కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని బెంగళూర్ సినీవార్త.నిజానికి ఈ లీక్‌ ఎప్పుడో బయటకు వచ్చింది కానీ.. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమా డిసెంబర్‌ మూడో వారంలో ఘనంగా లాంచ్‌ కాబోతున్నట్లు టాక్‌. ఇక ఈ కథ గోవాలో జరిగే డ్రగ్స్ మాఫియా(Drug mafia) చుట్టూ జరుగుతుందట. కొన్ని నెలలుగా యష్‌ ఈ కథతోనే ట్రావెల్‌ చేస్తున్నాడట.

మరీ ముఖ్యంగా కొన్ని నెలల కిందట గోవాకి వెళ్లి అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడట. అంతేకాకుండా గన్‌ షూటింగ్‌ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాడట. ఇలా షూటింగ్‌ స్టార్‌ అయ్యే సరికి ఫుల్ ప్రీపేర్‌ ఉండాలని డిసైడ్‌ అయిపోయాడట.

త్వరలోనే ఈ కాంబినేషన్‌పై అఫీషియల్‌ ప్రకటన వచ్చే ఛాన్స్‌ ఉంది. గీతూ మోహన్‌ గతంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది. మలయాళీ హీరో ‘నివిన్ పాలీ(Nivin Pauly)’ తో ముథూన్‌ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా తీసింది.

నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా నివిన్‌ కెరీర్‌లో ది బెస్ట్‌ సినిమాగా నిలిచింది. గీతూ మోహన్‌ దాస్‌ టేకింగ్‌, విజన్‌.. హీరో క్యారెక్టర్‌ డిజైనింగ్ ను సినీ ప్రముఖులు అభినందించారు. ఇక ఇప్పుడు ఏకంగా యష్‌తో సినిమా చేస్తుందంటే ఇక ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని సినీ లవర్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

You may also like

Leave a Comment