Telugu News » Budget 2024: బడ్జెట్‌కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న ధరలు..!

Budget 2024: బడ్జెట్‌కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న ధరలు..!

మొబైల్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో మొబైల్‌ఫోన్ల ధరలు సైతం తగ్గే అవకాశాలున్నాయి.

by Mano
Budget 2024: Center's key decision before the budget.. prices to come down..!

మధ్యంతర బడ్జెట్‌(Budget 2024)కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొబైల్‌ ఫోన్ల(Mobile Phones) ఉత్పత్తిలో ఉపయోగించే భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. మొబైల్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.

Budget 2024: Center's key decision before the budget.. prices to come down..!

ఈ నిర్ణయంతో భారతదేశంలో ఫోన్‌లను ఉత్పత్తి చేసే కంపెనీలకు మరింత ఊరట కలుగనుండగా దిగుమతి సుంకం తగ్గడంతో మొబైల్‌ఫోన్ల ధరలు సైతం తగ్గే అవకాశాలున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదికలో స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చని పేర్కొంది.

ప్రభుత్వ చర్య మేక్ ఇన్ ఇండియాను ఊతమిస్తోందని జీటీఆర్ఐ పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులార్ మాడ్యూల్స్, ఇతర మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఇప్పుడు ఐదు శాతం తగ్గనుంది. మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్‌ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్‌ సాకెట్, స్క్రూలు, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్‌లపై కూడా దిగుమతి సుంకం తగ్గనుంది.

You may also like

Leave a Comment