Telugu News » Budha Venkanna: ‘కేశినేని నాని కాదు కోవర్టు నాని..’ బుద్దా వెంకన్న విమర్శలు..!

Budha Venkanna: ‘కేశినేని నాని కాదు కోవర్టు నాని..’ బుద్దా వెంకన్న విమర్శలు..!

ఎంపీ కేశినేని నాని(Mp Keshineni Nani)పై ఉత్తరాంధ్ర టీడీపీ(TDP) ఇన్‌చార్జి బుద్దా వెంకన్న(Budha Venkanna) కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘కే అంటే కేశినేని కాదు కోవర్టు.. మొన్నటి వరకూ చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని.. ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడుగా మారాడు’’ అంటూ విమర్శలు గుప్పించారు.

by Mano
Kesineni Nani: Kesineni Nani's comments on Chandrababu.. Buddha Venkanna fire..!

ఎంపీ కేశినేని నాని(Mp Keshineni Nani)పై ఉత్తరాంధ్ర టీడీపీ(TDP) ఇన్‌చార్జి బుద్దా వెంకన్న(Budha Venkanna) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్లాక్ మెయిలింగ్‌కు మారు పేరుగా కేశినేని నాని అని.. 2వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో చెప్పగలడా అంటూ అని ప్రశ్నించారు.

Budha Venkanna: 'Keshineni Nani not Covertu Nani..' Budha Venkanna's Criticism..!

దొంగ రశీదు బుక్కులు తయారు చేయించి ఫైనాన్స్ కంపెనీకి కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన కోవర్టు నాని.. వంద రూపాయల బస్సు టికెట్టు రూ.500కు అమ్మాడంటూ విమర్శించారు.  ‘‘కే అంటే కేశినేని కాదు కోవర్టు.. మొన్నటి వరకూ చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని.. ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడుగా మారాడు’’ అంటూ విమర్శలు గుప్పించారు.

‘వైసీపీ కోవర్ట్‌ కేశినేనికి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా.. కేశినేని నాని ఊహల్లో బతికే వ్యక్తి కాబట్టే చంద్రబాబు స్థాయి అని చెప్పుకుంటాడు, లోకేశ్ గడ్డంలో నెరిసిన వెంట్రుక స్థాయి కూడా కేశినేని నానిది కాదు’ అన్నారు. ఈ కోవర్టును చంద్రబాబు ఈ జిల్లాలో చేసిన పొరపాటు అని బుద్దా వెంకన్న తెలిపారు. చంద్రబాబు అమాయకత్వం, మంచితనంతో వదిలేసారని, అదే జగన్ అయితే నానిని కొట్టి తరిమేసేవాడని అన్నారు.

అడగకున్నా చంద్రబాబు తనకు పదవిని కట్టబెట్టారని, కేశినేని నాని మాత్రం బ్లాక్ మెయిల్ చేసి కోఆర్డినేటర్ పదవిని తెచ్చుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు కుటుంబానికి విధేయుడుగా ఉంటానని చెప్పి ఇప్పుడు విమర్శలు చేస్తున్నాడని అన్నారు. ఒకే నంబరు ప్లేటు మీద బస్సులు తిప్పిన కోవర్టు నాని అని బుద్దా వెంకన్న ఆరోపించారు.

బాలయోగి ఆస్తులు కాజేసింది కేశినేని నాని అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని తెలిపారు. దళిత వ్యక్తి ఆస్తులు కాజేసి ఏ మోహం పెట్టుకుని అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు వెళ్లావంటూ నానిని ప్రశ్నించారు. బాలయోగి ఆస్తులు ఇచ్చేసి అంబేడ్కర్ విగ్రహం కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. జగనన్న వదిలిన బాణం షర్మిల.. ఇప్పుడు రివర్స్ అయిందని బుద్దా వెంకన్న విమర్శించారు.

You may also like

Leave a Comment