Telugu News » Kullu collapsing: కుండపోతతో కుల్లు కూలుతోంది..!

Kullu collapsing: కుండపోతతో కుల్లు కూలుతోంది..!

హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని భారీ వర్షాల కారణంగా ప్రతి ఇల్లు ప్రమాద నిలయంగా మారింది.

by sai krishna

హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని భారీ వర్షాల కారణంగా ప్రతి ఇల్లు ప్రమాద నిలయంగా మారింది. ఇళ్లన్నీ పేకమేడల్లా కూలుతున్నాయి. కుల్లులో ఏ క్షణాన ఏ భవనం కూలుతుందో తెలియని పరిస్థితి నెకొంది. క్షణం ముందు చూసిన ప్రదేశం మరో క్షణంలో బీభత్సంగా మారుతోంది.

‘కుల్లు’లోకొండచరియలు(Landslides) విరిగిపడి అనేక సంఖ్యలో నివాస భవనాలు కుప్ప కూలుతున్నాయి.అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని సమాచారం. కులులోని అన్నీ బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రతిక్షణం ఊహకందని విధ్వంసంతో అక్కడి ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. కుల్లూ(Kullu)లో ఇప్పటికే కుప్పకూలిన 8 భవనాలు సురక్షితం కావని ఐదారు రోజుల క్రితమే అధికారులు ప్రకటించారు.


భారీ వర్షాలకు ఈ భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయని గుర్తించి స్థానికులను ఇళ్లు ఖాళీ చేయించారు. ఈ భవనాల్లో దుకాణాలు, బ్యాంకులు ఇతర నివాసాలు ఉన్నట్లు తెలిపారు.

 

గురువారం అన్ని భవనాలు ఒకదాని తర్వాత మరొకటి నేలమట్టం అవడం వల్ల భారీగా ధూళి మేఘాలు(Clouds of dust) ఏర్పడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతను చూసిన అధికారులు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు.

కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ఇతర ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే 120 మంది మృత్యువాత పడగా.. ఈ సీజన్‌ మొదలైన జూన్ 24 నుంచి 238 మంది మరణించారు. 40 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మొత్తం 10వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

You may also like

Leave a Comment