Telugu News » dsc notification:రెండు రోజుల్లో టీఎస్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌!

dsc notification:రెండు రోజుల్లో టీఎస్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌!

డీఎస్సీ నోటిఫికేషన్‌ తో పాటు సంబంధిత విధివిధానాలు రెండ్రోజుల్లో వివరిస్తామని ప్రకటించారు.

by Sai
dsc notification to announced in two days

తెలంగాణ రాష్ట్రంలో టీచర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(sabitha indra reddy) ముఖ్యమైన ప్రకటన చేశారు. మరో రెండు రోజుల్లో డీఎస్పీ నోటిఫికేషన్‌ (dsc notification) విడుదల చేస్తామని తెలిపారు. సుమారు 6,500 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నట్లు ఆమె వివరించింది.

dsc notification to announced in two days

పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ తో పాటు సంబంధిత విధివిధానాలు రెండ్రోజుల్లో వివరిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ కూడా విద్యాశాఖ ఇచ్చింది.

ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈసారి కూడా టెట్‌ సిలబస్‌ లో ఎటువంటి మార్పు లేదు. పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌ -1 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షనను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. https://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. తుది ఫలితాలను సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తారు.

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం డీఎడ్‌, బీఎడ్‌ పాసైన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతేనే ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించే టీఆర్‌టీ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. టెట్‌లో వచ్చిన మార్కులకు టీఆర్‌టీ ర్యాంకింగ్‌లో 20 శాతం వెయిటేజీ ఉన్నందున టెట్‌లో అత్యధిక మార్కులు దక్కించుకోవడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు.

టెట్ లో అర్హత లేకపోతే ఈ పరీక్షలకు హాజరుకాలేరు.పైగా టెట్ ఉత్తీర్ణత లేకపోతే ప్రైవేటు పాఠశాలల్లో కూడా బోధన చేయడానికి వీలుండదు.

You may also like

Leave a Comment