ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేసేందుకు బీజేపీ (BJP) ప్రయత్నిస్తుందని.. సీఏఏ అమలు ద్వారా దేశంలో అరాచక పరిస్దితులు నెలకొనేలా వ్యవహరిస్తోందని, శివసేన (UBT) ప్రతినిధి ఆనంద్ దూబే (Anand Dubey) దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) ముందు కేంద్ర ప్రభుత్వం CAA నోటిఫికేషన్ జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు.

ధరల పెరుగుదల, దేశంలో నిరుద్యోగం వంటి ప్రదాన అంశాలపై నోరు మెదపదని వారు.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తున్నారని ఆరోపించారు.. ఇచ్చిన హామీల అమలుపై ఆసక్తి చూపని బీజేపీ ఎన్నికలు రాగానే జిమ్మిక్కులు చేస్తారని మండిపడ్డారు. అసలు రామ రాజ్యం అంటే ఏంటో బీజేపీకి తెలుసా ? అని ప్రశ్నించారు. రాముడు తానిచ్చిన మాట కోసం అరణ్యవాసం చేశారని, కానీ బీజేపీ పాలకులు పార్టీలను చీల్చి ప్రత్యర్దులను జైళ్లలో పెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికల్లో గెలుపు కోసం సీఏఏ తెరపైకి తెచ్చారని ఆరోపించిన దూబే.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.. మరోవైపు సీఏఏ నోటిఫికేషన్‌పై ఎస్పీ నేత ఎస్టీ హసన్ (ST Hassan) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్ని వాస్తవ అంశాల నుంచి పక్కదారి పట్టించేందుకే కేంద్రం సీఏఏను తెరపైకి తీసుకొచ్చిందని మండిపడ్డారు..