Telugu News » MLA Vivekanand Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెలా.. గేట్లు తెరిస్తే రావడానికి..?

MLA Vivekanand Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెలా.. గేట్లు తెరిస్తే రావడానికి..?

ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని వివేకానంద్ గౌడ్ ఆరోపించారు..

by Venu

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కే.పి.వివేకానంద్ గౌడ్ (MLA KP Vivekanand Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏదో అభద్రతా భావంలో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉన్నారని విమర్శించారు. మేము గెట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా వస్తారని అనడంపై మండిపడ్డారు. గేట్లు తెరిస్తే రావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS) గొర్రెలు కాదని చురకలు అంటించారు..

ఈ మాటలు అన్నందుకు ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని వివేకానంద్ గౌడ్ ఆరోపించారు.. ఏక్ నాథ్ షిండేలు కాంగ్రెస్ (Congress) నుంచే వస్తారని బీజేపీ (BJP) నేతలు అన్న విషయాన్ని గుర్తు చేశారు.. సొంత పార్టీపైనే రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి పట్టులేకుండా భయం భయంగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ హాయంలో జరిగిన పనులను ఆపే ప్రయత్నాలను సీఎం చేస్తున్నారని ఆరోపించారు. పాలన సరిగ్గా చేయడం తెలియక.. పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని వివేకానంద్ గౌడ్ మండిపడ్డారు.. ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం కల్పితాలతో కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు.. గత ప్రభుత్వంలో వేల కోట్లు పెట్టుబడులు వచ్చేవి.. కానీ ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు కూడ గుజరాత్ పోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిద్రపోతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని విమర్శించారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దలే కరీంనగర్.. నిజామాబాద్ లో బీజేపీకి సపోర్టు చేసారని ఆరోపించిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ కు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గతంలో వచ్చిన సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గత వందరోజులు పాలన పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్కకు యాదాద్రిలో జరిగిన అవమానం పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని పేర్కొన్నారు.. మేడిగట్టను రిపేర్ చేసి గేట్లు మూసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కే.పి.వివేకానంద్ గౌడ్ కోరారు.

You may also like

Leave a Comment