తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మంత్రులకు శాఖలు కేటాయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక రేవంత్‌తో పాటు మరో 11 మంది మంత్రులు ఈనెల 7 ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా ఎవరికి శాఖలు కేటాయించలేదు. అయితే ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతుండగా.. తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు.
కాగా, కీలకమైన హౌంశాఖను ఎవరికి కేటాయించలేదు. మరో ఆరుగురికి మంత్రి వర్గంలో స్థానం కల్పించనుండగా.. వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారో చూద్దాం..
భట్టి విక్రమార్క కి ఆర్థిక, ఇంధన శాఖ కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ, చేనేత శాఖ.. జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్, పర్యాటక శాఖ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ.. దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ మంత్రులుగా కొనసాగానున్నారు..
మరోవైపు శ్రీధర్‌బాబు – ఐటీ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల మంత్రిగా.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రిగా.. పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా.. సీతక్క – మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా.. కొండా సురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రులుగా కొనసాగానున్నారు. కాగా రేవంత్‌రెడ్డి వద్దే హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు ఉన్నాయి..