Telugu News » Sub Committee : సబ్ కమిటీ భేటీ… ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కమిటీ …!

Sub Committee : సబ్ కమిటీ భేటీ… ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కమిటీ …!

ఐదు గ్యారెంటీల గురించి ప్రధాన చర్చ జరిగింది. ఐదు గ్యారెంటీల విషయంలో నిజమైన లబ్ధిదారుల దరఖాస్తుదారుల ఎంపిక విధానం గురించి సీనియర్ అధికారులకు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దిశా నిర్దేశం చేశారు.

by Ramu
cabinet sub committee meeting at the secretariat

ప్రజా పాలన సబ్ కమిటీ (Sub Committee)సమావేశం సచివాలయంలో జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti Vikramarka)అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఐదు గ్యారెంటీల గురించి ప్రధాన చర్చ జరిగింది. ఐదు గ్యారెంటీల విషయంలో నిజమైన లబ్ధిదారుల దరఖాస్తుదారుల ఎంపిక విధానం గురించి సీనియర్ అధికారులకు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దిశా నిర్దేశం చేశారు.

cabinet sub committee meeting at the secretariat

ప్రజా పాలనకు ప్రజల నుంచి భారీగా స్పందన రావడంతో కొంత మంది ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రులు తెలిపారు. అందుకే కొంత మంది దురుద్దేశ పూర్వకంగా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి పనలు తగదని చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు.

మొత్తం రెండున్నర గంటల పాటు ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రజాపాలనలో ఐదు గ్యారెంటీలకు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? డేటా ఎంట్రీ ఎంత వరకు వచ్చిందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఒక్కో గ్యారెంటీకి సంబంధించి వచ్చిన అభ్యర్థనలు అనే విషయాన్ని ఆరా తీసినట్టు సమాచారం.

డేటాలో డూప్లికేషన్ లేకుండా లేకుండా చూసుకోవాలని అధికారులకు కమిటీ సూచించింది. దీని కోసం సీజీజీ, ఐటీ డిపార్ట్ మెంట్‌తో పాటు మిగతా అన్ని శాఖలు సమిష్టిగా ఈ డేటాను షేర్ చేసుకోవాలని చెప్పారు. ఆ డేటా నుంచి చివరగా శుద్దమైన డేటాను రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

You may also like

Leave a Comment