Telugu News » China – Taiwan: తైవాన్ చుట్టూ చైనా దళాలు.. స్వాధీనం చేసుకునే యత్నాలు…!

China – Taiwan: తైవాన్ చుట్టూ చైనా దళాలు.. స్వాధీనం చేసుకునే యత్నాలు…!

చైనా, తైవాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కొంతకాలం నుంచి చైనా - తైవాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ద్వీప దేశమైన తైవాన్‌(Taiwan)ను చైనా టార్గెట్‌ చేస్తూ వస్తోంది.

by Mano
China – Taiwan: Chinese troops around Taiwan...attempts to take over...!

చైనా, తైవాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కొంతకాలం నుంచి చైనా – తైవాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ద్వీప దేశమైన తైవాన్‌(Taiwan)ను చైనా టార్గెట్‌ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో చైనా(China) మరోసారి దూకుడు ప్రదర్శించింది. తైవాన్‌లో నేడు జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని మేధావులు అంచనా వేస్తున్నారు.

China – Taiwan: Chinese troops around Taiwan...attempts to take over...!

అయితే, తైవాన్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. దీంతో ద్వీపకల్పం చుట్టూ బలగాలను మోహరించిన చైనా ఆ దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను కట్ చేసి పూర్తిగా చైనా అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తైవాన్‌లోని బ్యాంకులు మూతబడనున్నాయి. ప్రజలు లావాదేవీలను ఆఫ్‌లైన్‌లోనే వినియోగిస్తున్నట్లు సమాచారం. స్వయం ప్రతిపత్తి పాలనలో ఉన్న తైవాన్‌ను తమ భూభాగానికి సంబంధించినదిగా చైనా భావిస్తోంది.

మరోవైపు తైవాన్ కంప్యూటర్ నెట్ వర్క్‌పై ప్రతిరోజు లక్షల సంఖ్యలో సైబర్ దాడులు కొనసాగుతున్నాయని తైవాన్ జాతీయ రక్షణ, భద్రత పరిశోధన సంస్థ నిపుణుడు క్రిస్టల్ టు తెలిపారు. చైనా తమపై దాడి చేసిన రోజున కేవలం రక్షణ వ్యవస్థకు, భద్రతా దళాలకు మాత్రమే నష్టం వాటిల్లదనీ.. తైవాన్‌ను పూర్తిగా ఈ ప్రపంచం నుంచి వేరుచేయడానికి ప్రయత్నిస్తోందని ఆ దేశ సైబర్ నిపుణులు పేర్కొన్నారు.

అయితే, తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతో పాటు తమపై ఇతర దేశాల పెత్తనాన్ని నిరాకరించడం చైనా సహించలేకపోయింది. దీంతో క్రమంగా తైవాన్‌కు ఇబ్బందులు సృష్టిస్తోంది. దీంతో ఏదో ఓ రోజున చైనా తైవాన్‌పై దురాక్రమణకు పాల్పడవచ్చన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సైబర్ దాడులతో చైనా ఆగిపోదు, ప్రపంచంతో తైవాన్‌కు సంబంధాలను తెగ్గొట్టేందుకు ప్రయత్నిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అలాగే, తైవాన్‌- చైనా యుద్ధం వాటిల్లితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రూ. 10 లక్షల కోట్ల డాలర్ల మేరకు నష్టం జరుగుతుందని బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్స్ సంస్థ తెలిపింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల ఏర్పడిన నష్టం కన్నా ఎక్కువ అని పేర్కొంది. తైవాన్ ప్రజల్లో పెరుగుతోన్న జాతీయవాద భావన, వాషింగ్టన్- బీజింగ్ మధ్య విచ్ఛిన్నమవుతోన్న సంబంధాలు, పెరుగుతోన్న చైనా ఆర్థిక, సైనిక శక్తిని బట్టి తైవాన్‌లో సంక్షోభం తప్పకపోవచ్చని నిపుణలు పేర్కొంటున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత అధునాతన సెమికండక్టర్ పరిశ్రమ తైవాన్‌లో ఉంది. అది కూడా స్తంభించిపోయింది. చైనా ప్రత్యక్షంగా తన సేనలను పంపడం తప్ప మిగిలిన అన్ని విధాలుగా తైవాన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. డ్రాగన్ కంట్రీ ప్రత్యక్షంగా దాడికి దిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 828 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

You may also like

Leave a Comment