Telugu News » California: పసిఫిక్‌ తుపాను ఎఫెక్ట్… అతలాకుతలమవుతోన్న కాలిఫోర్నియా…!

California: పసిఫిక్‌ తుపాను ఎఫెక్ట్… అతలాకుతలమవుతోన్న కాలిఫోర్నియా…!

అమెరికాలోని కాలిఫోర్నియా (California) రాష్ట్రాన్ని పసిఫిక్‌ తుపాను (Pacific storm) అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాను కారణంగా పలు నగరాల్లో కుంభవృష్టి(Aquarius) కురిసింది. దీంతో రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు.

by Mano
California: Pacific storm effect... California is suffering...!

అమెరికాలోని కాలిఫోర్నియా (California) రాష్ట్రాన్ని పసిఫిక్‌ తుపాను (Pacific storm) అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాను కారణంగా పలు నగరాల్లో కుంభవృష్టి(Aquarius) కురిసింది. దీంతో రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు.

California: Pacific storm effect... California is suffering...!రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చాలా చోట్ల వీధుల్లోకి బురద కొట్టుకొచ్చింది. పలు చోట్ల రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరదల కారణంగా దెబ్బతిన్న పసిఫిక్‌ తీర హైవేను అధికారులు మూసివేశారు. భారీగా వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల బుదర ఉండటంతో వాహనాలు చిక్కుకుపోయాయి.

బలమైన గాలులకు చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని దక్షిణాన ఉన్న పర్వతప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రభుత్వం కోరింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని లాస్ ఏంజిల్స్ మేయర్ విజ్ఞప్తి చేశారు. మొత్తం 130చోట్ల నుంచి వరదల సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు శాన్‌ఫ్రాన్సిస్కోలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిన ఘటనల్లో ముగ్గరు మృతిచెందారు. వేల సంఖ్యలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. లాస్‌ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో 1,100 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాల్లో 3.5 కోట్ల మంది ప్రస్తుతం వరద ముప్పులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

You may also like

Leave a Comment