అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహ సభను బీజేపీ ఘనంగా నిర్వహించింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ (BJP) గెలుపు నేపథ్యంలో గురువారం ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. సమావేశ మందిరంలోకి మోడీ ప్రవేశిస్తుండగా సభ్యులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనుల మధ్య ఆయనకు స్వాగతం పలికారు.
పార్టీ సభ్యులంతా మోడీ (Narendra Modi) నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా (JP Nadda) ప్రధానిని సత్కరించారు. కాగా సమావేశానికి ప్రధాని మోడీ రాగానే పార్టీ ఎంపీలు “మోడీ జీ కా స్వాగత్ హై” అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. మీరు నన్ను మోడీ అని పిలవండి, మోడీజీ కాదు అని చమత్కరించారు. మీరు మోడీజీ అని పిలవడం వల్ల మన మధ్య దూరం పెరిగినట్టు అనిపిస్తుందని తెలిపారు.
ఇకపోతే రాజస్థాన్ (Rajasthan)..ఛత్తీస్ గఢ్ (Chhattisgarh)..మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రుల ఎంపిక నేపథ్యంలో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఈ సమావేశం జరిగింది. మరోవైపు ఓట్ల శాతం, సీట్ల సంఖ్యలో పార్టీ పురోగతి సాధించింది. మోదీ నాయకత్వం వల్లే తెలంగాణలో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది.