Telugu News » Telangana : ముగిసిన ప్రమాణ స్వీకారం.. కొలువుదీరిన మంత్రులు వీరే..!!

Telangana : ముగిసిన ప్రమాణ స్వీకారం.. కొలువుదీరిన మంత్రులు వీరే..!!

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటుగా.. 11మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి.. శాఖాలను కేటాయించారు. వాటిలో హోమ్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించగా.. మల్లు బట్టి విక్రమార్కకు రెవెన్యూ, కోమటిరెడ్డి వెంటకరెడ్డికి పురపాలక శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాలు, పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఇరిగేషన్ శాఖను కేటాయించారు.

by Venu
Hyderabad: Congress leaders reached Tajkrishna.. Tight security at LB Stadium..!

ప్రత్యేక తెలంగాణ (Telangana) వచ్చాక రాష్ట్రంలో పత్తా లేకుండా పోయిన కాంగ్రెస్ (Congress)..తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి పది సంవత్సరాలు శ్రమించవలసి వచ్చింది. మొత్తానికి రేవంత్ రూపంలో మళ్ళీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కాగా హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన రేవంత్‌రెడ్డి (Revant Reddy) ప్రమాణ స్వీకారానికి.. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర ముఖ్య నేతలు హాజరైయ్యారు..

PM Modi congratulates Telangana’s first Congress CM Revanth Reddy

అనంతరం తాజ్ కృష్ణ హోటల్‌లో సోనియా (Sonia)..రాహుల్ (Rahul)..ప్రియాంక (Priyanka)..ఖర్గే, రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై మరోసారి చర్చించినట్లు సమాచారం. చర్చల అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి సీఎం రేవంత్‌రెడ్డి, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ , మంత్రులు బయలుదేరారు. కాగా పలువురు మంత్రులు, కాంగ్రెస్ కీలక నేతలు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి ఏఐసీసీ అగ్ర నేతలకు వీడ్కోలు పలకనున్నారు.

మరోవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటుగా.. 11మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి.. శాఖాలను కేటాయించారు. వాటిలో హోమ్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించగా.. మల్లు బట్టి విక్రమార్కకు రెవెన్యూ, కోమటిరెడ్డి వెంటకరెడ్డికి పురపాలక శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాలు, పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఇరిగేషన్ శాఖను కేటాయించారు.

ఆర్థిక శాఖను శ్రీధర్ బాబుకు కేటాయించిన రేవంత్ రెడ్డి.. సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫాల శాఖ, పొన్నం ప్రభాకర్‌కు బీసీ సంక్షేమ శాఖ, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, దామోదర రాజనర్సింహకు ఆరోగ్య శాఖను కేటాయించారు.

You may also like

Leave a Comment