మనిషికి శరీరం మీద శ్రద్ధపెరిగింది.యూట్యూబ్ లో ఆరోగ్యం గురించి ఎవరు ఏం చెప్పినా వింటున్నారు.ఏం తినమంటే అది తింటున్నారు.ఆ క్రమంలో ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్(Dry fruits)ట్రెండ్ నడుస్తోంది.పల్లెలు పట్టణాలని కాకుండా అందరూ డ్రైఫ్రూట్స్ తింటున్నారు.
డ్రై ఫ్రూట్స్ ఎవరు తినమన్నా మంచిదే..శరీరానికి కావాల్సిన సప్లిమెంట్స్ ని ఇవి భర్తీ చేస్తాయి.అయితే ఈ డ్రైఫ్రూట్స్ ఎప్పుడుబడితే అప్పుడు తినొచ్చా దానికి పర్టిక్యులర్ ముహూర్తాలున్నాయా అంటే…అలాంటివేవీ లేవని చెబుతూనే రాత్రి పడుకునే ముందు కూడా తినొచ్చంటున్నారు నిపుణులు.
అలా తినడం వల్ల కూడా ఉపయోగాలు మెండుగానే ఉన్నాయట.! హమ్మయ్యా…ఇదేదో పనికొచ్చే విషయంలా అనిపిస్తోంది కదా.!ఎందుకంటే కొనడం కొంటాం.కానీ తినడానికి టైమ్ ఉండదు..మృఖ్యంగా మహిళలకు. ఇంట్లో అందరికీ అన్నీ చేసి పెడుతుంటారు గానీ వారు మాత్రం తినరు. తినడానికి టైమ్ కూడా ఉండదు.
ఇంటి పని ముగించుకున్న తర్వాత పడుకునే ముందు ఏవో రెండు పలుకులు నోట్లో వేసుకుంటే అమ్మలంతా ఆరోగ్యంగా ఉండొచ్చు.చెప్పుకోతగ్గ విషయం ఏంటంటే పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ తింటే..శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందట. తగినంత నిద్ర కూడా పడుతుందట.
నిద్రలేమి(Insomnia)కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవి చాలా దారుణంగా ఉంటాయి. రోజులో మనం చేసే ప్రతిపనిలో శరీర అవయవాల్లో కదలికలు ఉంటాయి. ఫలితంగా వాటి సామర్థ్యం, శక్తి తగ్గుతాయి.
రాత్రివేళలో వాటికి తగిన విశ్రాంతి ఇస్తేనే..తిరిగి అవి సజావుగా పనిచేస్తాయి సరిగ్గా నిద్రించకపోవడం వల్ల కళ్లు ఎర్రబడటం, ముఖ కవళికలు మారిపోవడం వంటివి జరుగుతాయి.అలాగే మెదడు చురుకుదనం తగ్గుతుంది.నీరసం, బలహీనత వంటి సమస్యలు పెరుగుతాయి.
జీర్ణవ్యవస్థ(digestive system)చురుకుగా పనిచేయడం మానేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వస్తాయి. ఇలా నిద్రలేమి మనపై, మన జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రోజూ కనీసం 6 నుంచి 8 గంటల పాటు గాఢంగా నిద్రపోవాలని నిపుణులు(Experts)చెబుతున్నారు.
ఆహారం తిన్నవెంటనే పడుకుంటే బరువు పెరుగుతాం అని చాలామంది భయం. రాత్రివేళలో అన్నం బదులు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
గాఢంగా నిద్రపోవాలంటే..రాత్రి 7 గంటలలోగా ఆహారాన్ని తీసుకోవాలి.వీలైనంత వరకూ పండ్లు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి.
వీటిని తినడం వల్ల పొట్టతేలికగా ఉంటుంది. గ్యాస్ సమస్యలతో ఇబ్బంది ఉండదు. త్వరగా, తేలికగా జీర్ణమవుతాయి. ఉదయాన్నే మలబద్ధకం సమస్యలుండవు. కంటినిండా సుఖనిద్ర కలుగుతుంది. మరుసటిరోజూ యాక్టివ్ గా ఉంటారు. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.
రాత్రివేళ తీసుకునే ఆహారంలో బొప్పాయి, జామ, దానిమ్మ, యాపిల్, కివీ వంటి పండ్లు, నానబెట్టిన బాదం, పిస్తా, గుమ్మడి విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, సన్ ఫ్లవర్ సీడ్స్, కిస్ మిస్, అక్రూట్స్, అంజీర్ లను తినడం ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తుంది.