Telugu News » Chandrababu: ‘స్కిల్’ కేసులో బిగ్ ట్విస్ట్.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌‌పై ‘సుప్రీం’ సంచలన తీర్పు..!

Chandrababu: ‘స్కిల్’ కేసులో బిగ్ ట్విస్ట్.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌‌పై ‘సుప్రీం’ సంచలన తీర్పు..!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్‌పై జడ్జిలు అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

by Mano
Chandrababu: Big twist in 'Skill' case.. 'Supreme' sensational judgment on Chandrababu quash petition..!

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అక్రమమని, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Chandrababu: Big twist in 'Skill' case.. 'Supreme' sensational judgment on Chandrababu quash petition..!

అయితే, ఈ పిటిషన్‌పై జడ్జిలు అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫెర్ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసు సీజేఐ ముందుకు చేరింది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నమోదైన కేసులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. 2018లో వచ్చిన చట్టం ఆధారంగా చంద్రబాబు పిటిషన్‌ను కొట్టివేయలేమని స్పష్టం చేశారు.

‘చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17-ఏ వర్తింపజేయలేం. 2018లో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ 17(ఏ) ఏ నాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ పరిస్థితుల్లో చట్టం రాక ముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేం. అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం సెక్షన్ 17(ఏ) మూల ఉద్దేశం కాదు.’ అని జస్టిస్ బేలా ఎం త్రివేది తీర్పులో పేర్కొన్నారు.

అదేవిధంగా జస్టిస్ అనుద్ద్‌బోస్ తీర్పులో.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సెక్షన్ 17(ఏ) వర్తిస్తుంది. ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)సీ, డీ, 13(2) ప్రకారం విచారణ చేయడం తగదు. అయితే రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయడం కుదరదు. ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదనలేం.’ అని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment