Telugu News » Google Layoffs: టెక్ దిగ్గజం కీలక నిర్ణయం.. 1000 మంది ఉద్యోగులపై వేటు..!

Google Layoffs: టెక్ దిగ్గజం కీలక నిర్ణయం.. 1000 మంది ఉద్యోగులపై వేటు..!

2023లోనే భారీగా ఉద్యోగాల నుంచి తొలగించిన టెక్ సంస్థలు.. ఈ సంవత్సరంలోనూ అదే వరవడి కొనసాగిస్తున్నాయి. ఈసారి సెర్చింజ‌న్(Search Engine) దిగ్గ‌జం ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొల‌గించిన‌ట్లు స‌మాచారం.

by Mano
Google Layoffs: The key decision of the tech giant.. 1000 employees..!

టెక్ దిగ్గ‌జం గూగుల్(Google) కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగుల(Employees)పై వేటు విధించింది. 2023లోనే భారీగా ఉద్యోగాల నుంచి తొలగించిన టెక్ సంస్థలు.. ఈ సంవత్సరంలోనూ అదే వరవడి కొనసాగిస్తున్నాయి. ఈసారి సెర్చింజ‌న్(Search Engine) దిగ్గ‌జం ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొల‌గించిన‌ట్లు స‌మాచారం.

Google Layoffs: The key decision of the tech giant.. 1000 employees..!

గూగుల్ హార్డ్‌వేర్‌, సెంట్ర‌ల్ ఇంజనీరింగ్ టీమ్‌లు, గూగుల్ అసిస్టెంట్ స‌హా ప‌లు విభాగాల్లో కంపెనీ ఉద్వాసన ప్రకటించింది. లేఆఫ్స్ గురించి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌లేక‌పోయినందుకు చింతిస్తున్నామ‌ని, సంక్లిష్ట నిర్ణ‌యం తీసుకోవాల్సివ‌చ్చింద‌ని బాధిత ఉద్యోగుల‌కు పంపిన ఈమెయిల్‌లో కంపెనీ పేర్కొంది.

అర్హులైన ఉద్యోగుల‌కు ప‌రిహార ప్యాకేజీ వ‌ర్తింప‌జేస్తామ‌ని గూగుల్ స్ప‌ష్టం చేసింది. అయితే, ఇత‌ర విభాగాల్లో ఎంపిక చేసిన అవ‌కాశాల‌కు వేటుకు గురైన ఉద్యోగులు తిరిగి ద‌ర‌ఖాస్తు చేసుకోచ్చ‌ని పేర్కొంది. కంపెనీలో తిరిగి అవ‌కాశం ద‌క్క‌ని ఉద్యోగులు ఏప్రిల్‌లో కంపెనీని వీడాల‌ని తెలిపింది.

2023లో 1150కి పైగా టెక్ కంపెనీలు 2.60లక్షల మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చాయి. ఈనెల 15 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 48 టెక్ కంపెనీలు 7,528 మంది నిపుణులను ఇంటికి సాగనంపాయని లే-ఆఫ్ ట్రాకింగ్ వెబ్ సైట్ లే-ఆప్స్ ఎఫ్‌వైఐ ప్రకటించింది. ఈ ఉద్వాసనలు 2024లోనూ కఠిన నిర్ణయాలకు దారి తీస్తాయన్న సంకేతాలు వస్తున్నాయి.

You may also like

Leave a Comment