Telugu News » Chandrababu: ఓటమి భయంతోనే వేల కోట్లు దోచిపెట్టారు: చంద్రబాబు

Chandrababu: ఓటమి భయంతోనే వేల కోట్లు దోచిపెట్టారు: చంద్రబాబు

పింఛన్లపై జరుగుతున్న కుట్రలో అధికారులు భాగస్వామ్యంపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu nayudu) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపాలపురం(Gopalapuram) నియోజకవర్గంలోని నల్లజర్ల(Nallajarla)లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

by Mano
Chandrababu: Thousands of crores were looted by the fear of defeat: Chandrababu

పింఛన్లపై జరుగుతున్న కుట్రలో అధికారులు భాగస్వామ్యంపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu nayudu) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం ఇబ్బంది పెడతారా? అంటూ మండిపడ్డారు. గోపాలపురం(Gopalapuram) నియోజకవర్గంలోని నల్లజర్ల(Nallajarla)లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

Chandrababu: Thousands of crores were looted by the fear of defeat: Chandrababu

ఓటమి భయంతోనే రూ.13వేల కోట్లను జగన్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. పింఛన్లు డోర్ డెలివరీ చేయొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదని తెలిపారు. నగదును ముందుగానే డ్రా చేసి పెట్టుకోవాలి కాబట్టి వలంటీర్లను ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలని ఈ పన్నాగం పన్నారని అన్నారు.

తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని, సొంత బాబాయ్‌ అని చూడకుండా చంపేసి మళ్లీ దండేసి సానుభూతి పొందారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా ఇలాంటి శవరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పింఛన్ల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టి వారికి తప్పుడు సమాచారం ఇవ్వడం దారుణమన్నారు. వలంటీర్ వ్యవస్థను తామూ కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు.

మీ స్వార్థం కోసం వాళ్లను ఇలా ఇబ్బంది పెడితే భవిష్యత్తులో వారికి ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. గెలుపు కాంక్షతో వలంటీర్లను బలి పశువులను చేయడం దుర్మార్గమైన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలు ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలన్నారు. జగన్ తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

You may also like

Leave a Comment