రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. అలాగని మిత్రులు ఉండరు.. రాజకీయం వేరు.. వ్యక్తిగతం వేరు.. పొలిటికల్ లీడర్ గా ప్రతిపక్షాలపై విమర్శలు, ఆరోపణలు సహజమే.. ఇది అక్షరాల సత్యం అని తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం నిరూపించాయి. మాజీ సీఎం కేసీఆర్ గతవారం కాలు జారి పడగా శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే.. అయితే సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ఉన్న ఆయనను.. రేవంత్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్ మంత్రులు వెళ్ళి పరామర్శించారు..
ఎన్నికల సమరంలో తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ (Congress).. బీఆర్ఎస్ (BRS) మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకగానొక సమయంలో ఇరు పార్టీల కార్యకర్తలు దాడులు కూడా చేసుకొన్నారు.. అయిన ఎన్నికలు ముగిశాక.. ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనడం శుభసూచికంగా భావిస్తున్నారు.. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇంకా ఓటమి నుంచి కొలుకొనట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు చంద్రబాబు జైలుకి వెళ్ళిన సమయంలో కూడా బీఆర్ఎస్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. కానీ ఇవేవీ అడ్డుగోడలుగా భావించని టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) కేసీఆర్ను పరామర్శించడానికి హైదరాబాద్ సోమాజీగూడలో ఉన్న యశోద ఆసుపత్రి (Yashoda Hospital)కి వెళ్లారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొన్నారు.
ఇప్పటికే ప్రధాని మోదీ సహా పలు రాజకీయ పక్షాల నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, రిజ్వీని, యశోద ఆసుపత్రికి పంపి.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సైతం కేసీఆర్ క్షేమంగా ఉండాలని ట్వీట్ చేశారు. టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి సైతం కేసీఆర్ (KCR) ఆరోగ్యంగా ఉండాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రకాశ్ రాజ్ సైతం గులాబీ బాస్ ని స్వయంగా పలకరించారు..