Telugu News » Chandrayaan-3 : చంద్రయాన్- 3 ల్యాండింగ్ విజయవంతం

Chandrayaan-3 : చంద్రయాన్- 3 ల్యాండింగ్ విజయవంతం

by umakanth rao
Chandhrayan 3

 

Chandrayaan-3 అంతా విజయవంతమే. కోట్లాది భారతీయులు, ప్రపంచ దేశాలు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. బుధవారం సాయంత్రం సరిగ్గా 6 గంటల 4 నిముషాలకు చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. చంద్రుని దక్షిణ ధృవంపై బండరాళ్లు, గుంతలు లేని స్థలం చూసుకుని విక్రమ్ ల్యాండ్ అయింది.

 

ISRO makes history! Chandrayaan-3 successfully lands on Moon's South Pole - BusinessToday

 

నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఈ మిషన్ సూపర్ సక్సెస్ అయింది. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరో మైలు రాయిని చేరుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ తో ఇస్రో శాస్త్రవేత్తల సంతోషానికి అవధులు లేకపోయింది.

సాయంత్రం 5 గంటల 45 నిముషాలకు మొదలైనల్యాండింగ్ ప్రక్రియ కచ్చితంగా నిర్దేశిత సమయానికి పూర్తయింది/ జాబిల్లిపై రోవర్ ను విజయవంతంగా దింపిన ప్రపంచ దేశాల్లో ఇండియా నాలుగో దేశమైంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఈ ల్యాండింగ్ ని వర్చ్యువల్ గా చూశారు.

ఇస్రో శాస్త్రజ్ఞులను అభినందించారు. ఇది మన దేశానికే గర్వ కారణమన్నారు. భారత్ సరికొత్త చరిత్రను సృష్టించిందని అన్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ సమయం పట్టిందని, ఏమైనా ఈ విజయం మనందరిదని అన్నారు.

You may also like

Leave a Comment